Home అంతర్జాతీయ వార్తలు పొరపాటున మంత్రిని చంపేసిన భద్రతా బలగాలు!

పొరపాటున మంత్రిని చంపేసిన భద్రతా బలగాలు!

Somalia-Minister

మొగదీషు : మిలిటెంట్ అని పొరబడి ఓ మంత్రిని భద్రతా బలగాలు కాల్చి చంపిన ఘటన సోమాలియా దేశంలో చోటు చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల 8న ప్రజా పనులు, పునర్నిర్మాణం శాఖ మంత్రిగా అబ్బాస్ అబ్దుల్లాహి షేక్ సిరాజి (31) ప్రమాణస్వీకారం చేశారు. కాగా బుధవారం దేశ అధ్యక్షుడి కార్యాలయ సమీపంలో కారులో వస్తుండగా.. సెక్యురిటీ గార్డులు అనుమానస్పద కారుగా భావించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అబ్బాస్ సిరాజి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన దేశ అధ్యక్షుడు నలుగురు సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తప్పించారు. తన ఇథియోపియా దేశ పర్యటను రద్దు చేసుకొని మంత్రి అంత్యక్రియల్లో పాల్గొనబోతున్నట్టు తెలిపారు.