Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

గోరింటాకుతో ఆరోగ్యం

గోరింటాకు ఇష్టపడని వారుండరు. అందంగా కనపడేందుకు ఏ కాలంలోనైనా గోరింటాకు పెట్టుకుంటారు. కానీ, ఆషాఢమాసంలో ప్రత్యేకంగా గోరింటాకు ఎందుకు పెడతారో తెలుసుకుందాం.

Maidaku

గోరింటాకు పెట్టుకోవాలని యువతులు, మహిళలు తెగ ఇష్టపడుతారు. గ్రామాల్లోనైతే గోరింటాకు సులభంగా దొరుకుతుంది. నగరంలో మాత్రం రకరకాల మెహందీలు, డిజైన్లు మార్కెట్‌లో అందుబాటులో దొరుకుతాయి. అయితే, ఆషాఢ మాసం వచ్చిందంటే గోరింటాకు మెత్తగా నూరి దాన్ని పెట్టుకునే పనిలో ఉంటారు. ఎక్కువ మంది మహిళల్లో గోరింటాకు పూసిన ఎర్రని అందమైన చేతులే కనిపిస్తాయి. అసలు ఈ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? దీనివల్ల లాభం ఏంటో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, ఆషాఢం వచ్చిందంటే మార్కెట్లో దొరికే మెహెందీలను పక్కన పెట్టి గోరింటాకు వైపే మక్కువ చూపిస్తారు. గోరింటాకు వల్ల ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా చాలా ఉపయోగాలున్నాయి. ఆషాఢంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని వుంటుంది. ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి, బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది. కాబట్టి అనారో గ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటా కుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఆషాఢంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాకుండా, వైద్యులు కూడా మంచిదని చెబుతున్నారు. ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని కూడా అంటారు. ఇన్ని ప్రయోజనాలున్న గోరింటాకును తప్పనిసరిగా పెట్టుకోవడం వల్ల చేతులు ఎర్రగా పండి అందం, ఆకర్షణ గా ఉండడమేగాక ఆరోగ్యానికి చాలా మంచిది.
గోరింటాకు ఎర్రగా పండాలంటే..
గోరింటాకు ఎర్రగా పండితే అంత భర్త ప్రేమ దొరుకుతాడని యువతుల నమ్మకంగా ఉంది. అందుకు మంచి రంగు మారటానికి యువతులు బాగా కష్టపడుతారు. గోరింటాకు ఎర్రగా పండాలంటే ఇలా చేద్దాం. గోరింటాకు కొంచెం కొంచెం ఆరుతున్నప్పుడు, నిమ్మ పంచదార మిశ్రమాన్ని దూదితో మెల్లగా చేతులకు రాసుకోండి. కొంచెం ఆ మిశ్రమాన్ని వేడి చేసుకుని రాస్తే మంచి ఫలితం కనపడుతుంది. అదేవిధంగా, గ్యాస్ ఆన్ చేసి లవంగాల పొగను మీ చేతులకు తగిలేటట్టు చేసుకోవాలి. ఇది జిగటగా అన్పిస్తే, ప్రత్యామ్నాయంగా లవంగ నూనె వాడితే మనం అనుకున్న ఎర్రదనం వస్తుంది. నిమ్మపంచదార రసం, లవంగాల పొగ తర్వాత మీ గోరింటాకు ఎండిపోయాక దాన్ని ముక్కలు తీసినంక, ఒక చెంచాడు ఆవనూనె, పచ్చళ్ళ నూనెను చేతినిండా రాసుకోండి. ఈ నూనె గోరింటాకుకు మరింత రంగును తెస్తుంది.

Comments

comments