Home జాతీయ వార్తలు టాంజానియా యువతికి ఘోర అవమానం

టాంజానియా యువతికి ఘోర అవమానం

tanzaniaబెంగళూరు: బెంగళూరులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. టాంజానియాకు చెందిన యువతిని కొంత మంది వ్యక్తులు వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. వీధుల్లో పరుగెత్తించారు. ఆమె కారును కూడా తగులబెట్టారు. సంఘటన పూర్వపరాల్లోకి వెళితే బెంగళూరులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదానికి కారకులైన వారి కోసం మృతురాలి బంధువులు వెతుకుతున్నారు. ప్రమాద కారకులు విదేశీయులని తెలుసుకున్నారు. అదే సమయంలో టాంజానియా మహిళ, ఆమె స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం వివరాలు తెలుసుకుంటున్నారు. దీంతో ఆగ్రహంతో ఉన్న మృతురాలి బంధువులు ప్రమాదానికి కారణం వారే అనుకుని దాడికి పాల్పడ్డారు. బెంగళూరులో చదువుతున్న ఆ విద్యార్థినిని వివస్త్రను చేసి పరుగులు పెట్టించారు. ఆమె స్నేహితులపై దారుణంగా దాడి చేశారు. అనంతరం వారి కారును తగులబెట్టారు. ఇదంతా జరిగిన తర్వాత ప్రమాదం చేసింది మాత్రం సుడాన్‌కు చెందిన వ్యక్తి అని తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.