Search
Wednesday 26 September 2018
  • :
  • :

నోట్ల రద్దుతో మ్యూచువల్ ఫండ్స్ వైపు..

తొలి త్రైమాసికంలో రూ. 93,000 కోట్ల పెరుగుదల, మ్యూచువల్ ఫండ్స్, జీవిత బీమా పథకాలకు మళ్లిన పెట్టుబడి

                     Mutual-Funds

ముంబయి : నోట్ల రద్దుతో పొదుపరులు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిని ఎంచుకున్నారని, బంగారం సహా ఇతర ఆర్థిక పెట్టుబడుల కన్నా మ్యూచువల్ ఫండ్స్ ఆకర్షణీయంగా కనిపించడంతో అందులో మదుపు చేశారని భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ) ప్రచురించిన రెండు అధ్యయనాలు పేర్కొన్నాయి. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్లు బాగా పెరిగిపోయాయని, తద్వార వడ్డీరేట్లు పతనమైనట్లు మొదటి అధ్యయనం తెలిపింది. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్, జీవిత బీమా వంటి ఇతర బ్యాంకేతర ఆర్థిక ఇంటర్మీడియటరీలకు, బ్యాంకేతర కంపెనీలకు డబ్బు ప్రవాహించింది. దాంతో వాటి బ్యాలెన్స్ షీటు 2016-17లో 14.5 శాతం పెరిగింది. కొత్త వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి) చట్టం, రియల్ ఎస్టేట్ నియంత్రణ, అభివృద్ధి చట్టం2016(రెరా), బినామీ లావాదేవీల(నిరోధక) సవరణ చట్టం2016 వంటివి ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణను(ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకనామి) ప్రోత్సహిస్తాయని,  పైగా వీటి ద్వారా డబ్బు  ఇతర ఆర్థిక సాధనాల వైపుకు మళ్లగలదని భావిస్తున్నారు. పెద్ద నోట్లు రద్దయిన(డిమానిటైజేషన్) వెంటనే మదుపరుల పద్ధతిలో మార్పు చోటు చేసుకుంటుందని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ డి.సుబ్బారావు జోస్యం చెప్పినట్లుగానే జరుగుతోంది.

నల్లధనంకు సాంప్రదాయిక స్వర్గంగా రియల్ ఎస్టేట్ ఉందని సుబ్బారావు నాడన్నారు. ఇకపై రియల్ ఎస్టేట్‌లో నల్ల ధనం తగ్గిపోగలదు. నోట్ల రద్దు కారణంగా 2016 నవంబర్ 11 నుంచి 2016 డిసెంబర్ 30 వరకు బ్యాంకింగ్ వ్యవస్థలో 4.0 నుంచి 4.7 శాతం మేరకు అధికంగా డిపాజిట్లు జమా అయ్యాయని మొదటి అధ్యయనం వెల్లడించింది. ‘ఆర్థికీకరణ’(ఫైనాన్సియలైజేషన్) నిరంతర చర్యల వల్ల మంచి రాబడి అన్వేషణలో భాగంగా బ్యాంకు డిపాజిట్ల నుంచి డబ్బు కెపిటల్ మార్కెట్ల వైపుకు వెళ్ళిందని రెండో అధ్యయన నివేదిక పేర్కొంది. మ్యూచువల్ ఫండ్స్ ‘నిర్వహణ కింద ఆస్తులు’(అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్)  2017 మార్చి చివరినాటికి ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయిని తాకిం ది.

రూ. 17.5 లక్షల కోట్ల మేరకు చేరింది. ఈ కా లంలో వాటా పథకాల కిందకి వనరులు మళ్లించడం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్‌తో పాటుగా జీవిత బీమా పథకాలలో కూడా పెరుగుదల కనిపించింది. జీవిత బీమా కంపెనీలు సేకరించిన ప్రీమియంలు 2016 నవంబర్‌లో రెట్టింపయిం ది. 2016 నవంబర్ నుంచి 2017 జనవరి నాటికి 46 శాతం మేరకు ఇది పెరిగింది. ఈ రెండు అధ్యయనాల నివేదికలను సీనియర్ ఆర్‌బిఐ అధికారులు రూపొందించారు. వీటిని ఆర్‌బిఐ శుక్రవారం తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది. అయితే అందులో పేర్కొన్న అభిప్రాయాలన్నీ ఆ రచయితలవిగానే భావించాలని, వాటిని తమ అభిప్రాయాలుగా భావించనవసరం లేదని కూడా ఆర్‌బిఐ పేర్కొంది.

Comments

comments