Home లైఫ్ స్టైల్ డబ్బు నిర్వహణ నాకు తెలుసు…

డబ్బు నిర్వహణ నాకు తెలుసు…

మీ ఆర్థిక స్థితిని కేవలం మీరు సంపాదించే డబ్బు మాత్రమే నిర్ణయించదు. మీ డబ్బును నాలుగు కారకాలు నిలబెడతాయి : రాబడి, ఖర్చు, ఆస్తులు, ఆర్థిక బాధ్యతలు. అయితే ఎంత సమర్థవంతంగా మీరు వీటిని నిర్వహిస్తారనేదాన్నిబట్టి మీ ఆర్థిక స్థితి ఆధారపడుతుంది.

Money-Savings

పెట్టుబడులు, స్టాక్ మార్కెట్, క్రెడిట్ కార్డ్, ఇన్సూరెన్స్‌ల గురించి మీకు ఎంత తెలిసినా మీ డబ్బు గూర్చి సరైన అవగాహన లేకుంటే మీ పూర్తి ఆర్థిక నిర్వహణ దెబ్బతింటుంది. అందుకే ఆర్థిక నిర్వహణ చేయాలనుకున్నప్పుడు మీ డబ్బు గూర్చిన అవగాహన మీకు పూర్తిగా ఉండాలి. అప్పుడే సమర్థవంతంగా ఆర్థిక నిర్వహణ సాధ్యమవుతుంది. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు…
ఆర్థికంగా ఒక స్థితికి చేరేందుకు డబ్బు పాత్ర ఎంత?

  1. ఆదాయం, వ్యయం : మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు అనేదానిపైన దృష్టిపెట్టడం అవ సరం. అలాగే మీ అవసరాలు తీరగా ఎంత డబ్బు మీ చేతిలో ఉంటుందన్నది అవగాహన ఉండడం కూడా అవ సరమే. రాబడి, ఖర్చుల మధ్య ఉండే సమతూకం మీ ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది. ఇది భవిష్యత్తులో మీరు చేయబో యే ఆర్థిక ప్రణాళికకు దిక్సూచిలా ఉపయోగపడుతుంది. రెంటి మధ్య ప్రతి నెల సమతూకం ఆరోగ్యకరంగా ఉండ డం ఆర్థికంగా ఉన్నత స్థితిని సూచిస్తుంది, లేదా నెలాఖరు కు రెంటిమధ్య తూకం సున్నా లేదా మైనస్ ఉన్నట్లయితే (ఆస్తులు కూడబెట్టని పక్షంలో) ఇది బలహీనమైన ఆర్థిక స్థితిని సూచిస్తుంది. రాబడిలో ఆరోగ్యకరమైన మిగులు మీ ఆర్థిక లక్ష్యాలు చేరేందుకు దోహదపడతాయి.
  2. ఆస్తులు, బాధ్యతలు : మీ దగ్గర ఉన్న ఆస్తులు, వస్తువుల విలువ అనేవి మీ ప్రస్తుత ఆర్థిక స్థితిని కచ్చితంగా నిర్థారిస్తాయి. మీ దగ్గర ఉన్న ఆస్తులు మీ రాబడిలో తప్పకుండా మార్పు తీసుకువస్తాయి (అది ఇప్పటికిప్పుడైనా కావచ్చు, తర్వాతైనా కావచ్చు). ఉదాహరణకు : బంగారం, వెండి, బ్యాంక్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, ఆర్ట్/ పురాతన వస్తువులు, భూమి, ఇండ్లు ఇలా ఏ ఆస్తి అయినా రాబడి పెంచేవిగా, ఖర్చులు తగ్గించేవిగా తోడ్పడతాయి, ఇల్లు తీసుకున్నట్లైతే కిరాయి, ట్యాక్స్‌లు తగ్గుతాయి. అందుకే ఆస్తులపై ఖర్చుచేయడంవల్ల ఆర్థిక స్థితి మెరుగ వుతుంది. పెరిగే బాధ్యతలు కూడా మీ ఆర్థిక స్థితిని బలహీ నపరుస్తాయి. అప్పు ఉండడం అనేది రుణం కట్టే బాధ్యత ను పెంచుతుంది. అలాగే పాత వాహనం వాడుతున్నట్లైతే దాని నిర్వహణ, ఇంధన ఖర్చులు పెరిగిపోతాయి.
    తక్కువ రుణ బాధ్యతలు, ఎక్కువ ఆస్తులనేవి ఆర్థిక స్థితిని మెరుగుపరిచి, డబ్బును బలపరుస్తాయి.

దీనికి సంబంధించి ఈ నాలుగు కేసులను పరిశీలిస్తే…
ఆసిఫ్ (23) : నెలకు రూ.10,000 కాల్ సెంటర్ ఉద్యోగం ద్వారా సంపాదిస్తాడు. అందంగా కనపడ డానికి, జీవించడానికి చేసే ఖర్చు రూ.9200. ఇప్పటివరకు ఏ రకమైన పెట్టుబడి చేయకపోగా తన క్రెడిట్ కార్డ్ లో రూ.3200 బాకీ పడ్డాడు.
బాబు (30) : బ్యాంకులో క్లర్కుగా పనిచేసే బాబు నెలకు రూ.4,000 సంపాదిస్తాడు. అలాగే నెలకు రూ. 2000 ఖర్చుచేస్తూ, సేవింగ్ ఎకౌంట్‌లో రూ. 4800 దాచుకున్నాడు. అయితే ఇంతవరకు పెద్దగా ఉపయోగ పడే ఇన్వెస్ట్‌మెంట్ ఏం చేయలేదు, కాని నెలనెలా రూ.800 ఇఎమ్‌ఐ తాను తీసుకున్న గృహరుణానికి చెల్లిస్తున్నాడు.
చంద (26) : గృహిణి అయిన చంద, తన భర్త గృహావసరాలకు నెలనెలా ఇచ్చే రూ.4500ల్లో ంచి రూ.500 మిగిల్చి, తన సేవింగ్స్ ఖాతాలో జమచేస్తూం డేది. అలా తన దగ్గర రూ.3000 డబ్బు జమయ్యింది.
డేవిడ్ (19) : కామర్స్ మూడో సంవత్సరం చదువుతున్న డేవిడ్ పెట్టుబడులను జాగ్రత్తగా పెట్టడం మొదలు పెట్టాడు, అలా రూ.5000 మ్యూచువల్ ఫండ్స్ కొన్నాడు. తన 19 వ ఏట పుట్టినరోజు సందర్భంగా బహుమతిగా వచ్చిన డబ్బును ఈ విధంగా ఇన్వెస్ట్ చేశాడు. కేవలం రాబడే ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుందంటే ఆసిఫ్ ఆర్థిక స్థితి ధృఢమైనదిగా చెప్పాలి, కాని అతడు తాను సంపాదిస్తున్న డబ్బును సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తున్నాడా? తన ఆర్థిక స్థితి నిజంగా ధృఢంగా ఉన్నదా. ఉద్యోగం పోతే ఏర్పడే ఆర్థిక అత్యయిక స్థితిని అతను ఎదుర్కోగలడా అనేవి ప్రశ్నలు.
నిజానికి పై ఉదాహరణలను చూసినట్లైతే ఆసిఫ్ చేతిలో డబ్బు ఎక్కువగా ఉన్నా, చాలా బలహీనమైన ఆర్థిక స్థితిని కలిగి ఉన్నాడు. సంపాదన ఎంతనో అంత ఖర్చు చేస్తున్నాడు, అంతే కాకుండా క్రెడిట్ కార్డ్ మీద కూడా అప్పు కలిగిఉండడంతో ఆర్థిక సంక్షోభంలో ఉన్నాడు ఆసిఫ్. నెల నెల తాను మిగిల్చే డబ్బు, క్రెడిట్ కార్డ్ పై కట్టే అత్యధిక వడ్డీ అన్నీ కలిపితే ఆసిఫ్ తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోడానికి ఆరునెలల పై చిలుకు సమయం పడుతుంది, ఇదంతా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేకుంటేనే.
మిగతా ముగ్గురు, వారి ఆదాయం తక్కువగా ఉన్నా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. బాబు ఇంటి రుణం తీరుస్తున్నాడు, చంద తన సొంత సేవింగ్స్ ఎకౌంట్ తెరిచింది, డేవిడ్ తన వయసుతో నిమిత్తం లేకుండా పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు. వీటన్నింటిని చూస్తే వచ్చే ఆదాయం అనేది ఆర్థిక స్థితిని నిర్ణయించదన్నది నిర్థారణ అవుతున్నది.

ఆర్థిక పునాది నిలబడే నాలుగు మూలస్తంభాలు ఇవి…

  1. ఆదాయం
    ఇది మరో మూడింటికి ముడిపడి ఉంటుంది
  2. ఖర్చు
  3. ఆస్తులు
  4. బాధ్యతలు

మీరిప్పుడు సంపాదించే ఎంత తక్కువైనా సరే ఈ నాలుగింటిని నిర్వహించడమే మీ ఆర్థిక పునాది ఎంత ధృఢంగా ఉన్నదో నిర్ణయిస్తుంది. కాబట్టి ఆదాయ వ్యయాల రికార్డు దాచడం, బడ్జెట్ వేసుకోవడం, ఆదా చేయడం ద్వారా మరింత జాగ్రత్తచేసుకోవచ్చు.
రికార్డు రాయడం : కట్టిన బిల్లులు, రిసిప్టులు, ట్యాక్స్ డాక్యుమెంట్లు, ఆదా వివరాలు, పెట్టుబడులు, క్రెడిట్ కార్డులు, వారంటీ/ గ్యారంటీ కార్డుల వివరాలను సమయానుకూలంగా దొరికేలా కచ్చితమైన ప్రదేశాల్లో రాయటం అవసరం.
బడ్జెటింగ్ : ఒక పద్ధతిని నిర్ణయించుకొని, మీకు కావల్సిన పరిస్థితుల్లో వాడుకునేట్లుగా ఉండేందుకు ఆర్థిక ప్రణాళిక చేసుకోవడం అవసరం. దీనివల్ల బాధ్యతలు తగ్గి, వివేకవంతమైన ఖర్చు చేస్తాం, దాంతో డబ్బు ఆదా అయి సరైన పద్ధతిలో పెట్టుబడి పెడతాం ఇది మీ ఆదాయంలో వచ్చి చేరుతుంది.
ఆదా చేయడం : ఆర్థిక అత్యయిక స్థితిని ఎదుర్కునేందుకు, పెట్టుబడి పెట్టడానికి, ఆస్తులు పెంచుకోవడానికి డబ్బు ఆదాచేయడం ఉపయోగపడుతుంది.