Home నిజామాబాద్ ఆటో బోల్తా: పలువురికి గాయాలు

ఆటో బోల్తా: పలువురికి గాయాలు

Some People Injured In road Accident in Bodhan

బోధన్: వర్ని మండలంలో మల్లారం గ్రామ పంచాయితీ సమీపంలోని బెల్యానాయక్ తండ వద్ద శుక్రవారం ఆటో బోల్తా పడి నట్లు ఎస్‌ఐ సాయినాథ్ తెలిపారు. వివరాలలోకి వెళితే పోలీసులు తెలిపిన ప్రకారం.. బాన్సువాడ నుండి వర్ని వైపు వెళ్తున్న ఆటో బస్సును తప్పించేందుకు ప్రయత్నించగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయని  పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాథితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.