Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఆదాయానికి ఆలోచనలెన్నో..

different experimentsమనలో చాలా మంది నిద్ర లేచినప్పటినుంచీ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ లాంటివి ఎక్కువగా చూసేస్తుంటారు. అయితే ఊరికే లైకులు చూసుకోవడమే కాకుండా, సోషల్‌మాధ్యమాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో చూద్దాం.దాని వల్ల లాభం కూడా ఎలా ఉంటుందో తెలుసుకుందాం ..

మీరు భిన్న ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడి విశేషాలను , ప్రదేశాలనూ ఫొటోలు తీసుకున్నారా. అయితే వాటన్నింటినీ ఓ బ్లాగ్‌లో పెట్టి ఆ ప్రత్యేకతలను రాయండి. క్రమంగా చూసేవారు పెరుగుతారు. లేకుంటే ఫేస్‌బుక్‌లో ప్రత్యేకంగా ఓ పేజీని తెరిచి అందులో ఎప్పటికప్పుడు పోస్టులు కూడా పెట్టొచ్చు. ఇతర సభ్యుల ద్వారా ఇంకొన్ని కొత్త ప్రాంతాల వివరాలు తెలుస్తాయి. కొందరికి రకరకాల ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం. అవి సఫలం కాకుంటే వాటిని వివరిస్తూ యూట్యూబ్‌లో ఏకంగా ఓ చానల్ కూడా ప్రారంభించొచ్చు. మీకు నచ్చిన కళాకృతుల తయారీ, కొత్త వంటకాలు, దుస్తుల డిజైనింగ్ ఇలా ఏదైనా సరే కానివ్వండి. యూట్యూబ్‌ లో పెట్టండి. ఆదరణతోపాటు ఆదాయం కూడా వస్తుంది. ఇంటర్‌నెట్ సాయంతో మీకు వచ్చిన కళల్ని మెరుగుపరుచుకోవచ్చు. అది ఏదైనా కావచ్చు అలంకరణ, ఫ్యాషన్‌లాంటివి. దానివల్ల నైపుణ్యం పెరగడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా సొంతం అవుతాయి. ఒక వేళ మీకు నచ్చితే ఆ రంగంలోనే అడుగుపెట్టొచ్చు. ఆన్‌లోనే ఫిట్‌నెస్ ట్రైనర్‌గా మారొచ్చు. దుస్తులపై అవగాహన లేనివారికి పర్సనల్ షాపర్ అయ్యే అవకాశం ఉంది.

Comments

comments