Home జోగులాంబ గద్వాల్ ఎక్కింది పంచకళ్యాణి జరగదు పైసా బోణీ

ఎక్కింది పంచకళ్యాణి జరగదు పైసా బోణీ

                      Cart

మానవపాడు: రాజులకాలంనుండి మనం రవాణాకు ఉపయోగించేది గుర్రం గుర్రం బండి(జట్కా)ను నేటికి మనం వినియోగిస్తున్నాం ముఖ్యంగా మానవపాడు మండలంలో గుర్రపు బండి వెళ్లని గ్రామాలు లేవని చెప్పవచ్చు. ఒకనాడు గుర్రం బండిపై వెళ్లాలంటే రాజయోగం పట్టినట్లు భావించేవారు కానీ నేడు గుర్రం బండిని అడిగేనాథుడు కరువయ్యారు. అయినా మండలంలోని చండూరు గ్రామవాసులకు గుర్రపు బండియే ఆదారం. ఈ గ్రామానికి బస్సుల రాకపొకలు లేవు. ఆటోలు వెళ్లాలంటే రోడ్డు సరిగా లేదు అందుచేత ఆటోలు, జీపులు రావడానికి వెనుకంజ వేస్తారు. ఈ తరుణంలో గుర్రపు బళ్లు శరణ్యంగా నిలిచాయి. అయితే ఈ గ్రామంలో గుర్రపు బళ్లను నమ్ముకుని జీవించేవారు ఉన్నా రెక్కాడితే కానీ డొక్కాడని అనేక కుటుంబాలు కూడా ఉన్నాయి. గుర్రపు బండిని ఎక్కాడు గానీ పైస బోణి కూడా జరగదు అంటున్నారు.  జల్లాపురం వరకు బిటి రోడ్డు వేస్తే గుర్రపు బళ్లతో పాటుఇతర వాహనాలకు కూడా అందుబాటులో ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. గతవారం పల్లెవికాసం జరగగా నేటి వరకు బస్సు తిరగడం లేదని ప్రజలు ఆరోపించారు.