Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

కన్నయ్యకు ప్రసాదాలు

కృష్ణుడు వెన్నదొంగ.. పాలతో తయారుచేసిన పదార్థాలను అమితంగా ఇష్టపడతాడు. కృష్ణాష్టమి సందర్భంగా కన్నయ్యకు రకరకాల వంటకాలతో విందు చేయాల్సిందే. అటుకులు, బెల్లం, వెన్న, బెల్లం, పచ్చి శనగపప్పులతో సంతృప్తి చెందే తత్వం ఆయనది.  

Ladoo-Phirni

అటుకుల పల్లీ లడ్డు

కావాల్సినవి : 

  • అటుకులు ఒక కప్పు
  • పల్లీలు పావు కప్పు
  • చక్కెర అరకప్పు
  • నెయ్యి పావు కప్పు
  • వంట కర్పూరం చిటికెడు
  • యాలకుల పొడి పావు చెంచా
  • జీడిపప్పు కొన్ని

ఎలా చేయాలంటే
స్టవ్ మీద మూకుడు పెట్టి అటుకుల్ని వేయించాలి. లేత గోధుమ రంగులోకి వచ్చాక తీసి ఒక పళ్లెంలో పెట్టుకోవాలి. అదే విధంగా పల్లీలనుకూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. వేడి తగ్గాక పల్లీలు పొట్టుతీసి, మిక్సీలో పౌడర్‌లా చేసుకోవాలి. తర్వాత అటుకుల్నీ, పంచదారను విడివిడిగా మిక్సీలో పొడి చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు, అటుకులు, చక్కెర పొడి, వంట కర్పూరం, యాలకుల పొడి, జీడిపప్పు పలుకులు ఓ గిన్నెలోకి తీసుకుని, బాగా కలపాలి. నెయ్యిని కరిగించి, కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుంటూ లడ్డూలు తయారుచేయాలి.

ఫిర్నీ 

కావాల్సిన పదార్థాలు

  • గంటపాటు నానబెట్టిన బియ్యం ఒక కప్పు
  • నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుని పేస్ట్‌లాగా తయారుచేసుకోవాలి.
  • పాలు రెండు కప్పులు
  • కండెన్స్‌డ్ మిల్క్ ఒక కప్పు
  • యాలకుల పొడి అర టేబుల్ స్పూన్
  • రోస్ వాటర్ ఒక టేబుల్ స్పూన్
  • అలంకరణ కోసం బాదం పప్పులు

తయారీ విధానం
స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో రెండు కప్పుల పాలు పోయాలి. ఇందులో రైస్ పేస్ట్‌ను వేసి బాగా కలుపుతూనే ఉండాలి. స్టవ్ తక్కువ మంటలో పెట్టుకోవాలి. కలుపుతూనే ఉండాలి లేకుంటే అడుగంటి ఉండలు కట్టుకుంటుంది. కొంచెం గట్టి పడుతున్నప్పుడు కండెన్స్‌డ్ మిల్క్ ఒక కప్పు కలపాలి. రెండు నిముషాలు ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. దీంతో మిశ్రమం చిక్కగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని, యాలకుల పొడి, రోస్ వాటర్ యాడ్ చేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇదం తా తక్కువ మంటలోనే చేసుకోవాలి. ఇదంతా సెర్వింగ్ బౌల్‌లో వేసుకుని ఒక గంటపాటు ప్రిజ్‌లో పెట్టాలి. ఫ్రీజర్‌లో పెట్టకూడదు. గంట తర్వాత బయటకు తీసి బాదం పప్పులు, రోజ్‌పెటల్స్‌తో అలంకరించుకోవాలి.

Comments

comments