Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

మెమన్ అంత్యక్రియలలో పాల్గొన్నవారూ తీవ్రవాదులే

tathagata royకోల్‌కతా : గురువారం జరిగిన యాకూబ్ మెమన్ అంత్యక్రియలకు హాజరైన వారిలో బంధువులు, స్నేహితులు మిన హా తక్కినవారిని తీవ్రవాదులుగా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాలని త్రిపుర గ్రవర్నర్ తథాగత రాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలు వారిపై తీవ్రవాద ముద్రను వేయాలని రాయ్ ట్వీట్ చేశారు. ఆయన వ్యాఖ్యలకు సర్వత్రా నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో రాయ్ వివరణ ఇస్తూ గవర్నర్‌గా ప్రజల మనోభావాలను అందరికీ తెలియజేయడం తన బాధ్యతని, గవర్నర్‌గా తాను ఎంతమాత్రం రాజీపడబోనని అన్నారు. ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో రాయ్ మాట్లాడుతూ ఉరి తీసిన వ్యక్తిని చూసేంకు ఇతరులు ఎందుకు రావాలని ప్రశ్నించా రు. బంధువులు, స్నేహితులు రావడంలో అర్ధం ఉందని, అయితే ఇతరత్రా సంబంధంలేనివారు అక్కడకు వచ్చారంటే వారు అతనిపట్ల జాలిచూపుతున్నారనే కదా! అని ప్రశ్నించారు. రాయ్ వ్యాఖ్యలపై లోకసభ మాజీ సీకర్ సోమనాథ్ ఛటర్జీ స్పందిస్తూ  ‘రాయ్ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. ఆయన వ్యాఖ్యలు ఆయన పదవికి తగ్గట్టుగా లేవు’ అని వ్యాఖ్యానించారు. ఆయన తన అభిప్రాయాలను ట్వీట్ చేయకుండా ఉంటే బాగుండేదన్నారు. ము ఖ్యమంత్రికి ట్వీట్ చేయవచ్చు లేదా నేరుగా చెప్పవచ్చని సోమనాథ్ అన్నారు. రాయ్ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారన్న విషయాన్ని జ్ఞప్తికి ఉంచుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుబ్రతా ముఖర్జీ అన్నారు.

Comments

comments