Search
Saturday 17 November 2018
  • :
  • :

బ్లాక్‌హెడ్స్ నివారణకు…

Black-Heads

చర్మ సమస్యలు అనేక రకాలుగా ఇబ్బందిపెడు తుంటాయి. చర్మ సమస్యలో బ్లాక్‌హెడ్స్ ఒకటి. ముఖంపై బ్లాక్‌హెడ్స్ వస్తే అందవికారంగా కనిపిస్తారు. బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి ఇప్పటికే చాలామంది నానా రకాలుగా ప్రయత్నించి, ఎలాంటి ఫలితం లేకపోవ డంతో అసంతృప్తిగా ఉండొచ్చు. అయితే, సహజసిద్ధ పదార్థాలు వాడితే చర్మ రంధ్రాలు శుభ్రంకావడంతో బ్లాక్‌హెడ్స్ తొలగిపోతాయి. దీంతో అందంగా కనిపిస్తారు. బ్లాక్‌హెడ్స్‌ను శాశ్వతంగా తొలగించే సహజసిద్ధ పదార్థాల గురించి తెలుసుకుందాం. అయితే, ఈ పదార్థాలను ఫేస్‌ప్యాక్ చేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ వేసుకోవడం మరువకూడదు.
పసుపు, పుదీనా రసం
అనాదికాలం నుంచి పసుపు సంప్రదాయ ఔషధంగా చెప్పుకుంటాం. దీనిని ఫేస్‌ఫ్యాక్‌గా వాడడం వల్ల స్కిన్ కండీషన్‌ను ట్రీట్ చేస్తుంది. బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది. ముఖ్యంగా పుదీనా జ్యూస్ ను కాంబినేషన్ తో చర్మానికి ఫేస్ ప్యాక్ ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఈ ప్యాక్ చర్మం రంద్రాల నుండి డెడ్ స్కిన్ సెల్స్‌తోపాటు బ్లాక్ హెడ్స్‌ను తొలగిస్తుంది.
తయారీ విధానం : ఒక టీస్పూన్ పసుపు పౌడర్, 2 టీస్పూన్ల పుదీనా జ్యూస్ మిక్స్ చేసి, స్మూత్ గా పేస్ట్ చేసి, తర్వాత ముఖానికి ప్యాక్ లా వేసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్ తొలగి పోతాయి.
తేనె, నిమ్మరసం
ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ మాస్క్ నిమ్మరసంలో ఉండే ఆస్ట్రింజెంట్ లక్షణాలు తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో కలిసినప్పుడు, ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. ఇది చర్మంలోని బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.
తయారీ విధానం : ఒక టీస్పూన్ తేనె తీసుకుని, అందులో ఒక టీస్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్ మిక్స్ చేయాలి. దీన్ని బ్లాక్ హెడ్స్ మీద అప్లై చేసి, 15 నిము షాల తర్వాత ట్యాప్ వాటర్‌తో శుభ్రం చేసు కోవాలి.
ఎగ్ వైట్, బేకింగ్ పౌడర్
ఎగ్ వైట్, బేకింగ్ పౌడర్ ఈ రెండింటి మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేస్తే చర్మంలోని మలినాలు తొలగిస్తుంది. బ్లాక్ అయిన చర్మ రంధ్రాలతో సహా శుభ్రపరుస్తుంది. బ్లాక్ హెడ్స్‌ను తొలగిస్తుంది.
తయారీ విధానం : ఒక టీస్పూన్ బేకింగ్ పౌడర్ లో ఒక ఎగ్ వైట్ వేసి రెండూ మిక్స్ చేసి, రెండింటిని ముఖం మొత్తానికి అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

Comments

comments