Home ఆదిలాబాద్ సోమేశ్వరుడి..గోడు వినేదెవరన్న!

సోమేశ్వరుడి..గోడు వినేదెవరన్న!

  • రేపటి నుంచి రెండు రోజులు కుంటాల జలపాతం వద్ద జాతర

Siddeshwara Swamy Templeనేరడిగొండ : దట్టమైన అడవుల్లో పెద్దకొండ పై ఉన్న ఈ జలపాతం రాష్టంలోనే ప్రఖ్యాతి గాంచిన ప్రకృతి అందాలకు చిరునామా ఈ కుంటాల జలపాతం 42 అడు గుల ఎత్తుపై సహజ సిద్ధంగా కూడిన ఈ ప్రాతం భక్తులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. జలపాతంపై నుంచి నీరు కిందపడే చోట చిన్న రాతి గుహ ఉంటుంది. అందులో సో మేశ్వరుడు,నంది విగ్రహలు ఉంటాయి.

10మంది మాత్ర మే ఈ గుహలోకి వెళ్ల్లాగలరు. జలపాతం దిగువన కుడి వైపు చెట్టు కింద కాకతీయుల నాటి దేవతాల విగ్రహలు కనిపిస్తాయి. గిరిపుత్రుల ఆరాద్యదైవం. సందర్శకులంతా కుంటాల జలపాతాన్ని పర్యాటక ప్రాతంగానే చూస్తారు.

కానీ ఇక్కడి చుట్టుపక్కల ఉండే గిరిజనులు మాత్రం జలపాతాన్ని ఆరా ధ్యదైవంగా భావిస్తారు. కొండలపైన ఒక గూహలో శివలిం గం ఉండడంతో అక్కడ పారేనీటిని సాక్షాత్తు భగవంతుని ప్ర సాదంగా భావిస్తారు. దేవతల మొక్కులు, పండుగలు అధి వాసుల సంవత్సరానికి రెండు సార్లు పూజలు జలపాతం వ ద్ద నిర్వహిస్తారు.మహాశివ రాత్రిని పురస్కరించుకొని ఏటా ఇక్కడ జాతర ఘనంగా జరుగుతుంది.ఇంతటి ప్రసిద్ది కలిగి న ఈ జలపాతం వద్ద సౌకర్యలు లేక ఇక్కడి వచ్చే భక్తులకు ఇబ్బందిగా ఉంది.

సోమేశ్వరుడి దర్శించే దారేది?

గిరిజనులు,ఆదివాసీలతో పాటు అధికసంఖ్యలో భక్తులు శుక్ర,శనివారం మహశివరాత్రి పర్వదినాన రెండు రోజులు ఇక్కడ జాతర నిర్వహించబడుతుంది.గుహలో వేలసిన సో మన్నను వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. గృహ లోకి వెళ్లడానికి కనీసం రహదారి లేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం అవుతుంది.

పక్కనే జలపాతం ఉన్న గుక్కెడు మంచినీళ్లు దొరకని దుస్థితి ఈ సమస్యలు జలపాత అభివృద్ధిపై అధికారులు స్థానిక ప్ర జాప్రతినిధుల నిర్లక్ష్యాంగా వదిలేశారు. కుంటాల గ్రామాని కి చెందిన గంగాపుత్ర యూత్ సభ్యులు గుహలోకి వేళ్ల డానికి తాత్కాలిక నిచ్చెనను ప్రతీ సంవత్సరం ఇక్కడ రెండు రోజు ముందు పెడుతారు. ఇక మరుగుదొడ్లు లేక పోవడం వల్ల భక్తుల ఇబ్బందిగా ఉంది.

దృష్టింతా ఆదాయంపైనే

వాహనాల పార్కింగ్,జలపాతం వద్ద ఏర్పాటైన దుకాణాల సముదాయాలతో ఆలయానికి భారీగా ఆదాయం వస్తుంది. సంబంధిత అధికారులు కనీస సౌకర్యాల ఏర్పాటుపై పట్టన ట్లు వ్యవహరిస్తున్నారు. కుంటాల గ్రామానికి చెందిన గంగా పుత్ర సంఘం సభ్యులు ఇక్కడ శివరాత్రికి రెండు రోజులు గైడ్లుగా ఉంటారు.