Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

రాష్ట్రపతి ఒక్కోసారి పొరబడొచ్చు

Uttarakhand-High-Courtడెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రపతి నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం కోర్టుకు లేదన్న కేంద్రం వాదనను తోసిపుచ్చింది. రాష్ట్రపతి కూడా ఒక్కోసారి పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని, న్యాయ సమీక్షకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని సూచించింది. రాష్ట్రపతి పాలనను కోర్టులు సమీక్షించ జాలవని కేంద్రం వాదించింది. రాచరికపాలనలో మాదిరిగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదని, రాజ్యాంగ పరిధికి లోబడి వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. రాష్ట్రపతి విజ్ఞతపై తమకు ఎలాంటి అనుమానం లేదని, ఏది చేసినా న్యాయ సమీక్షకు అనుగుణంగా చేయాలని తెలిపింది. మార్చిలో హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. కేంద్రం సిఫార్సు మేరకు శాసన సభను రాష్ట్రపతి సుప్తచేతనావస్థలో ఉంచారు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఉన్నత న్యాయస్థానాల్లో వాదోపవాదనలు కొనసాగుతున్నాయి.

Comments

comments