Friday, April 19, 2024

కొడుకు చేతిలో తండ్రి హతం

- Advertisement -
- Advertisement -

వనపర్తి : కొడుకు చేతిలో తండ్రి హత్యకు గురైన సంఘటన వనపర్తి జిల్లా, వనపర్తి మండల పరిధిలోని చిన్నగుంటపలిలో సోమవారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్‌ఐ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన తెలుగు బచ్చయ్య (60)కు ముగ్గురు కుమారులు. వీరికి పెళ్లిళ్లు అయ్యాయి. ప్రతి సంవత్సరం తండ్రిని ఒకరు పోషించాలి. ఈ సంవత్సరం పెద్ద పెద్ద కుమారుడు కురుమయ్య వంతు పడింది. ఈ నేపథ్యంలో తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ వాగ్వాదంలో కురుమయ్య కోపంతో పక్కనే ఉన్న గొడ్డలితో గొంతు నరికాడు. ఈ ఘటనలో బచ్చయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి మరో కుమారుడు చిన్న కురుమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News