Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

తాగిన మైకంలో తండ్రిని హత్య చేసిన తనయుడు

Son Killed His Father

నిజామాబాద్:  తాగిన మైకంలో తండ్రిని కుమారుడు హత్య చేసిన ఘటన  జిల్లాలోని మోర్తాడ్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది . పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాల ప్రకారం.. మోర్తాడ్‌కు చెందిన ఏర్గట్ల గంగారాం కొడుకు, ఇద్దరు కూతుళ్లతో కలిసి కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. తండ్రి కొడుకులకు తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో రాజు తన తండ్రిని చితకబాదడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహం ఉన్న ఇంటి వద్దకు వచ్చి రాజును అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రిని కొట్టి చంపినట్లు రాజు పోలీసుల ముందు ఒప్పుకోవడంతో రాజును అరెస్ట్, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Comments

comments