Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

తండ్రిని హతమార్చిన తనయుడు

Venkatesh

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగ ళవారం తనయుని చేతిలో తండ్రి హతమైన ఘటన వెలుగుచూసింది. స్థానిక గీతానగర్‌కు చెందిన కోరెం వెంకటేశం నిత్యం మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేస్తుండడంతో భరించలేని కు మారుడు సాయిప్రకాశ్ (20) మంగళవారం మధ్యాహ్నం కర్రతో తలపై కొట్టడంతో తలపగిలి వెంకటేశం అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘ టనకు కారకుడైన మృతుని కుమారుడు సాయిప్రకాశ్ పోలీసులకు లొంగిపోయాడు. వెంకటేశం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి పూర్తిస్థాయిలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments