Search
Saturday 22 September 2018
  • :
  • :

కొడుకు చేతిలో తల్లి హత్య

RAMA

పెద్దపల్లి : ఓ కొడుకు తన తల్లిని రోకలిబండతో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రామగిరి మండల పరిధిలోని ముస్త్యాల   గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన మేరుగు ప్రశాంత్ తన తల్లి మేరుగు రమ అలియాస్ రామక్క(48)ను హత్య చేశాడు. దినసరి కూలీగా పని చేసే ప్రశాంత్ ఆదివారం రాత్రి ఇంటికి వచ్చాడు. ఇంట్లో అన్నం లేకపోవడంతో తల్లితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆవేశానికి గురైన ప్రశాంత్ రోకలిబండతో తల్లి రమ తలపై మోది చంపేశాడు. పోస్టుమార్టం కోసం రమ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు.

Son Murders his Mother in Mustyala Sunday night

Comments

comments