Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

సోనాక్షి కల నెరవేరింది

Sonakshi-Sinha123బాలీవుడ్ బ్యూటీ సోనాక్షిసిన్హా కల నెరవేరిందట. ఎన్నాళ్ల నుంచో కంటున్న తన కల నిజం కావడంతో అమ్మడు ఎంతో సంతోషప డిపోయింది. వివరాల్లోకి వెళ్తే… ఇటీవల సోనాక్షి సాన్‌ఫ్రాన్సిస్కో ఫ్యూజన్ టూర్‌కు వెళ్లింది. అక్కడ జరిగిన ఓ ఈవెంట్‌లో తన ఫేవరేట్ స్టార్ మాధురీదీక్షిత్‌తో కలిసి స్టేజ్ షోలో పాల్గొంది సోనాక్షి. మాధురీతో కలిసి డోలా రె డోలా… పాటకు డ్యాన్స్ చేయడంతో తన కల నెరవేరిన ట్లయిందని ఈ భామ ఎంతో ఆనందపడిపోయింది. సూపర్ డ్యాన్సర్ మాధురీతో కలిసి స్టెప్పులు వేయడం మరచిపోలేని అనుభూతి అని సోనాక్షి పేర్కొంది. ఈ డ్యాన్స్ షో ఆహుతులను మైమరపించిందట. దీంతో తన జీవితంలో మరచిపోలేని సంఘటన ఇదని సోనాక్షి తెలిపింది. ఈ టూర్‌లో ఆమెతో పాటు అక్షయ్‌కుమార్, ప్రభుదేవా కూడా పాల్గొన్నారు.

Comments

comments