Home తాజా వార్తలు కుర్రకారు ఫిదా

కుర్రకారు ఫిదా

బికినీ బీచ్ విహారంలో స్పెషలిస్టులెందరో. తరచుగా విదేశీ ఒంటరి దీవులకు వెళ్తూ అక్కడి నుంచి బికినీ బీచ్ విహారానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అదరగొడుతున్న భామలు ఎందరో. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ కూడా బికినీ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేసింది. ఆమె నందమూరి బాలకృష్ణ సరసన ‘లెజెండ్’ చిత్రంలో కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. బోయపాటి ప్రోత్సాహంతో ‘డిక్టేటర్’ మూవీలోనూ అదిరిపోయే ఐటమ్ సాంగ్‌తో అదరగొట్టింది ఈ హాట్ బ్యూటీ. అటుపై టాలీవుడ్‌లో ఆశించిన ఛాన్సులేవీ రాకపోవడంతో కెరీర్‌లో వెనుకబడింది సోనాల్. బాలీవుడ్‌లో గత ఏడాది ‘ఫాల్తాన్’ లాంటి భారీ మల్టీస్టారర్‌లో నటించింది.

ఇందులో జాకీష్రాఫ్, అర్జున్ రాంపాల్, సోనూసూద్ లాంటి స్టార్లు నటించారు. అలాగే ‘జాక్ అండ్ జిల్’ అనే మరొక చిత్రంలోనూ సోనాల్ నటించింది. అటుపై బాలీవుడ్‌లోనూ ఆఫర్లు లేవు. అయితే ఈ భామ ప్రస్తుతం ‘ఫైర్’ అనే ఓ హిందీ వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. జీ ఒరిజినల్‌లో ఈ వెబ్ సిరీస్ లైవ్ కానుంది. ఈలోగానే ఇదిగో కాస్తంత తీరిక సమయం చిక్కగానే ఇలా విదేశాలకు వెళ్లి అక్కడ ఒంటరి దీవుల్లో బికినీలో హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం సోనాల్ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. రెడ్ బికినీలో ఈ అమ్మడి లుక్‌కు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.

sonal chauhan enjoys summer in bikini mode