Search
Monday 24 September 2018
  • :
  • :

ప్రాణం తీసిన పాట

Sing-song

కాసిపేట: ఒక పాట ఒకరి మర ణానికి కారణమైంది. యువతి మరణం ఆందోళనకు దారి తీసిన ఘటన. కాసిపేట మండలం కోనూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వడ్డెర కాలనీలో జరిగింది. అలకుంట రాజం లక్ష్మీ దంపతుల ప్రకారం వారికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు చిన్నకుమారుడైన సంజీవ్(8) తమ ఇంటి సమీపంలో కుమారి 21ఎఫ్ పాట లవ్ చేయాల వద్దా అంటూ సినిమాలోని పాట పాడుతుండగా అక్కడ సమీపంలో వున్న కనకయ్య, సమ్మక్క, కుమారులు సుధాకర్, నరేష్‌లు మా అమ్మాయిని చూసి పాడు తున్నావుంటూ సంజీవ్‌ను కొట్టారు. ఇది చూసిన శిరీష, కుమార్‌లు చిన్న పిల్లవాడిని ఎందుకు కొడుతున్నారని అడ్డుకోగా, వీరిని నలుగురు తీవ్రంగా కొట్టడంతో పాటు శిరీష జాకెట్టును కూడా చించారని దీంతో మనస్థాపానికి గురైన శిరీష ఇంటిలో పురుగుల మందు తాగింది.

దీంతో శీరిషను కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గత నెల 22న జరగగా, గత రెండు రోజుల క్రితం చికిత్స ఫలించక బుధవారం సాయంత్రం మృతి చెందింది. కనకయ్య సమ్మక్క కుటుంబ సభ్యులు దాడి చేసి అవమానించడం వల్లే తమ కూతురు మరణించిందని తాము పోలీస్‌స్టేషన్‌లో ఆరోపిస్తూ వారిపై ఫిర్యాదు చేసినా దేవాపూర్ పోలీసులు పట్టించుకోలేదని సంబంధికులు వాపో యారు. దాంతో వారు మృతదేహంతో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న మందమర్రి ఎస్‌ఐ రాజమొగిలి గౌడ్, కాసిపేట ఎస్‌ఐ పోచంపల్లి సతీష్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలి కుటుంబీకులతో, బంధువులతో చర్చించి ఫిర్యాదు చేసిన వారందరిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించుకున్నారు. కాగా ఇద్దరు వయస్సు నిర్ధారణ చేయాల్సి వుందన్నారు.

Comments

comments