Home జాతీయ వార్తలు కాంగ్రెస్‌కు షాక్… బిజెపిలో చేరిన సోనియా సన్నిహితుడు

కాంగ్రెస్‌కు షాక్… బిజెపిలో చేరిన సోనియా సన్నిహితుడు

 

న్యూఢిల్లీ: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, యూపిఎ చైర్ పర్సన్ సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడు టామ్ వడక్కన్ బిజెపిలో చేరారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో గురువారం ఆయన బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. అనతంరం ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలో టెర్రరిస్టులు దాడి చేస్తే.. దీనిపై మా(కాంగ్రెస్) పార్టీ మాట్లాడిన తీరు నన్ను చాలా బాధించింది. ఓ రాజకీయ పార్టీ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే, నాకు ఆ పార్టీని వీడడం తప్ప మరో ఆప్షన్ కనిపించలేదు’ అని టామ్ వడక్కన్ వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన టామ్ వడక్కన్… సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టన తర్వాత ఏర్పాటు చేసిన తొలి మీడియా కమిటీలోనూ ఆయన పనిచేశారు.

Sonia Gandhi Aide, Cong leader Tom Vadakkan Joins BJP