Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సోనియాగాంధీ భిక్షతోనే గద్డెనెక్కిన కెసిఆర్

 

cong

నియంతృత్వ టిఆర్‌ఎస్ పాలనపై యుద్ధం
కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్
మానుకోటలో కాంగ్రెస్ ప్రదర్శన
టిడిపి, టిఆర్‌ఎస్‌ల నుంచి
కాంగ్రెస్‌లో భారీ చేరికలు
దద్దరిల్లిన యశోధ గార్డెన్ సభావేదిక

మనతెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిథి: తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మంట కలుపుతు న్న టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై యుద్ధం చేద్దామని కేంద్ర మా జీ మంత్రి పోరిక బలరాంనాయక్ అన్నారు. టిడిపి, టిఆర్‌ఎస్‌ల నుంచి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, సీతక్క, హరిప్రియ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మానుకోటలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం యశోధ గార్డెన్‌లో డిసిసి అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బలరాంనాయక్ మాట్లాడుతూ సోనియాగాంధీ బిక్షతోనే నేడు కెసిఆర్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడని, తెలంగాణలో మిగులు బడ్జెట్‌ను లక్షకోట్ల అప్పుల్లో ముంచి కుటుంబపాలన కొనసాగిస్తున్నాడని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడ ని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కెసిఆర్ ముఖ్యమంత్రి పీఠం కోసం మాటతప్పి తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని మోసగించాడన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లు కల్పింస్తానన్న కెసిఆర్ చేతకాక ఆదివాసీల్లో చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటున్నారన్నారు. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జండా ఎగురవేయడం ఖాయమని, ఇప్పటికే టిఆర్‌ఎస్ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చిం ది సోనియాగాంధీ అని ప్రజలు గట్టి నిర్ణయంతో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కి సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధమయ్యే టిడిపి, టిఆర్‌ఎస్‌ల నుండి కాంగ్రెస్‌లోకి వలసలు వస్తున్నారని, ఇంకా పెద్దసంఖ్యలో కాం గ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని  ఆయన స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేద్దాం కాం గ్రెస్‌ని అధికారంలోకి తీసుకువద్దామని బలరాంనాయక్ పిలుపునిచ్చారు.
టిఆర్‌ఎస్ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి: వేం నరేందర్‌రెడ్డి
రాష్ట్రంలో టిడిపి నుండి నాయకులు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లోకి వలసలు వస్తూ ఉండడంతో టిఆర్‌ఎస్ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి అన్నారు. తాము కాంగ్రెస్‌లో చేరినందుకు సంతోషంగా ఉందని, తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలను ఆపాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావడమే లక్షంగా పనిచేస్తామన్నారు. మహబూబాబాద్ జిల్లాలో టిఆర్‌ఎస్ నామరూపాలు లేకుండాపోతుందని, కాం గ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లో వలసలు పెరుగుతాయని, కార్యకర్తలకు అండగా ఉంటూ కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జండా ఎగురవేసేందుకు కృషి చేస్తానని వేం అన్నారు.
ఆట మొదలైంది: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
రాష్ట్రంలో టిఆర్‌ఎస్ నియంతృత్వ పాలన అరికట్టేందుకు ఆట మొదలైందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలోనే బడుగు బలహీనవర్గాల అభివృద్ధి జరిగిందని, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ముఖ్యమంత్రి కెసిఆర్ దుర్మార్గ, దోపిడీ, కుటుంబపాలనను అంతమొందించేందుకు కంకణబద్దులు కావాలని కార్యకర్తలు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాడని, బడుగు బలహీనవర్గాలకు ఉచిత కరెంట్ కాంగ్రెస్‌పార్టీ ఇస్తే టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి వారికి బిల్లుల మోత మోగిస్తూ 24గంటల కరెంట్ ఇస్తున్నానని చెప్పడం బలహీనవర్గాలను మోసగించడమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు పావలావడ్డీకే రుణాలు ఇచ్చి మహిళల ఆర్ధిక పురోభివృద్ధికి కృషి చేసిందని, దేశంలో రూ.70వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఒకేసారి మాఫీ చేసిన ఘనత కేవలం కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో నేడు రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందని, పండిన పంటకు గిట్టుబాటు ధరలేక, రుణాలు అందక, రుణమాఫీ లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం కనికరం లేని ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ ఎలా చేస్తారని, రైతు కన్నీరు పెట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించిన దాఖలాలు లేవని హెచ్చరించారు. టిఆర్‌ఎస్‌కు రోజులు దగ్గరపడ్డాయని, రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
మహిళాలోకం తిరగబడాలి: సీతక్క
రాష్ట్రంలో మహిళను గుర్తించని టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై మహిళాలోకం తిరగబడాలని, కుటుంబపాలన అంతమొందించాలని ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాలను అణిచివేస్తూ, ప్రశ్నించే గొంతుక నొక్కుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వ పాలనపై తిరుగుబాటు చేయాలని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యాడని, తెలంగాణ ప్రజలను నయవంచనకు గురిచేసి ఆయ న కుటుంబసభ్యులు నలుగురే రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారని, ఈ టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహిళలకు సరైన గౌవరం దక్కడంలేదని, రాబోయే రోజుల్లో మహిళలు ఎవ్వరూ టిఆర్‌ఎస్ పార్టీలో ఉండరని సీతక్క హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి ఎస్‌టిసెల్ ఉపాధ్యక్షులు బెల్లయ్యనాయక్, డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి డాక్టర్ రాంచంద్రునాయక్, ఇల్లందు నాయకురాలు హరిప్రియ, చుక్కల ఉదయచందర్, బాలుచౌహాన్, సుచిత్రబాలునాయక్, ఉమామురళీనాయక్, వెన్నం లకా్ష్మరెడ్డి, నూనావత్ రాధ, ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, రావుల రవిచందర్‌రెడ్డి, బోనగిరి గిరిధర్‌గుప్త, దస్రునాయక్, దళ్‌సింగ్, అప్పెవేణు, తదితరులు 16మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

comments