Home జాతీయ వార్తలు సోనియాకు స్వల్ప అస్వస్థత

సోనియాకు స్వల్ప అస్వస్థత

Sonia-Gandhi

న్యూఢిల్లీ: యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. కుమార్తె ప్రియాంకతో కలిసి సోనియా సిమ్లా వెళ్లారు. అయితే అక్కడ వాతావరణం పడకపోవడంతో సోనియా అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. దీంతో ఆమెను చికిత్స కోసం హూటాహూటిన చండీగఢ్‌కు తరలించారు. కానీ అక్కడ సోనియా చికిత్స తీసుకోలేదు. దాంతో ఆమెను శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చారు. వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు సోనియా చండీగఢ్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.