Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

బిజెపి కౌంట్ డౌన్ స్టార్ట్స్: సోనియా

Sonia Gandhi says BJP Government Count Down Starts Now

న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాహుల్ గాంధీ అధ్యక్షతన తొలిసారి ఆదివారం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ… మోడీ నేతృత్వంలోని ఎన్ డిఎ ప్రభుత్వం కౌంట్ డౌన్ ప్రారంభమైందని సోనియా అన్నారు. మోడీ సర్కార్ హయాంలో దేశంలో పేదలకు  రక్షణ లేకుండా పోయిందని, ద్వేషభావం పెచ్చరిల్లిందని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ప్రధాని మాటలు ఆయనలోని అభద్రతా భావానికి నిదర్శనమన్నారు. బీజేపీ కౌంట్ డౌన్ మొదలైందన్నారు. యుపిఎ కూటమి సమష్టిగా పని చేసేలా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని సోనియా వెల్లడించారు. ఈ సమావేశంలో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గులాంనబీ ఆజాద్, లోక్ సభలో ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నేతలు, అన్ని రాష్ట్రాల నుంచి పిసిసి చీఫ్‌లు, సిఎల్‌పి నేతలు పాల్గొన్నారు. ఎపి నుంచి రఘువీరా రెడ్డి, తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ హాజరయ్యారు.

Comments

comments