Home జాతీయ వార్తలు రాయ్‌బరేలిలో సోనియా పర్యటన…

రాయ్‌బరేలిలో సోనియా పర్యటన…

Sonia-Gandhiన్యూఢిల్లీ: యుపిఎ చైర్‌పర్సన్, కాంగ్రెస్ ఎంపి సోనియా గాంధీ బుధవారం రాయ్‌బరేలిలో పర్యటిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం సోనియా రాయ్‌బరేలిలో పర్యటించడం ఇదే మొదటి సారి. ఈ పర్యటనలో సోనియాతో పాటు ఆమె కూతురు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. సోనియాకు కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు.

రాయ్‌బరేలి నుంచి గెలిచిన సోనియా తమ పార్టీ కార్యకర్తలతో బుధవారం సమావేశం భేటీ కానున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో 80 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికలు జరగగా… కేవలం ఒక్క స్థానంలోనే కాంగ్రెస్ గెలుపోందింది. అమేథిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘోర పరాజయం పాలయ్యారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 52 స్థానాల్లో మాత్రమే గెలిచింది.

Sonia Gandhi visit in Raebareli