Home తాజా వార్తలు సోనియా లెక్కల్లో పూర్: అనంత్ కుమార్

సోనియా లెక్కల్లో పూర్: అనంత్ కుమార్

Ananth-Kumar3

ఢిల్లీ: మోడీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో నెగ్గుతుందని కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే స్పష్టం చేశారు. పార్లమెంటు లోపల బయట ఎన్‌డిఎ ప్రభుత్వానికి పూర్తిగా మెజారిటీ ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లెక్కల్లో పూర్  అని, ప్రతిపక్షాలకు సంఖ్యబలంలేదని ఎద్దేవా చేశారు.  గతంలో వాజ్‌పేయీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంలో బిజెపి ఓడిపోయినప్పటికి కాంగ్రెస్ మాత్రం నిలబెట్టుకోలేకపోయిందని  గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్‌డిఎ భాగస్వామ్యంలో ఉన్న పార్టీలన్నీ మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. లోక్‌సభలో ఎన్డీఏ కూటమి బలం 313 ఉండటంతో అవిశ్వాసంలో తాము విజయం సాధిస్తామని  అనంతకుమార్‌ ధీమా వ్యక్తం చేశారు.