Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

విపక్ష పార్టీలకు 13న సోనియా విందు

Sonia-gandhi-iamge

న్యూఢిల్లీ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఈనెల 13న విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు అన్ని పార్టీల నాయకులను ఆమె ఆహ్వానించారు. బిజెపికి వ్యతిరేకంగా ఐక్య కూటమిని ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే సోనియా ఈ విందును ఏర్పా టు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటులో వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్న తరుణంలో 2019 లోక్‌సభ ఎన్నికల కంటే ముందు ప్రతిపక్షాన్ని మరింత పటిష్టం చేసేందుకు, ఐక్య కూటమికి అంకురార్పణ చేసేందుకుగాను ఆమె ఈ అడుగు వేస్తున్నట్టు పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యం లో బిజెపి, కాంగ్రెసేతర కూటములు అనే అంశాలు తెరపైకి వచ్చాయి. ఇలాంటి తరుణంలోనే సోనియా నుంచి ప్రతిపక్షాలకు విందుకు ఆహ్వానాలు అందడం గమనార్హం. సోనియా విందుతో పార్లమెంటు బయట, లోపల బిజెపిని వ్యతిరేకించే పార్టీలన్నీ ఒక చోట చేరుతున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. ‘ఇది కేవలం విందు మాత్రమే కాదు, బిజెపి పాలనకు వ్యతిరేకంగా ఐక్య కూటమిగా ఏర్పడేందుకు ఆసక్తి చూపే పార్టీలన్నీ ఒక చోట చేరే వేదిక’ అని ఓ సీనియర్ నాయకుడు పేర్కొన్నారు. ఆహ్వానాలు అందుకున్న వారంతా విందుకు హాజరవుతారని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ సహా ప్రతిపక్ష నాయకులతో కలిసేందుకు సోనియా గాంధీ ఎంతో ఆసక్తితో ఉన్నారని పేర్కొన్నారు. పార్లమెం టు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలన్నీ సభలోను, బయట నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. వివిధ అంశాలపై పార్లమెంటులో టిఆర్‌ఎస్, టిడిపి, ఎస్‌పి, బిఎస్‌పి, టిఎంసి, వామపక్షాలు, డిఎంకెతో పాటు ఇతర అన్ని పక్షాలు మం చి సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని టిఎంసి నేత డెరిక్ తెలిపారు.

Comments

comments