Search
Saturday 17 November 2018
  • :
  • :

తెలంగాణ ప్రజలదేవత సోనియా

cong2

జగిత్యాల ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి
మనతెలంగాణ/జగిత్యాల: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పా టుతోనే మా బతుకులు బాగుపడతాయని రోడ్డెక్కిన మూ డున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి సో నియా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని, తెలం గాణ ప్రజల పాలిట సోనియా దేవత అని సిఎల్‌పి ఉపనేత, జగిత్యాల ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి అన్నారు. సోనియా జన్మది న వేడుకలను జగిత్యాలలో ఘనంగా నిర్వహించారు. తన నివాసం నుంచి పాత బస్టాండ్‌లోని ఇందిరాగాంధీ విగ్ర హం వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించిన జీవన్‌రెడ్డి అనంతరం సోనియా బర్త్‌డే కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ,తెలంగాణ రాష్ట ప్రకటనను సీమాంధ్రులు అడ్డుకునేం దుకు విశ్వ ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ను గుర్తించిన సోనియా తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన దేవతగా కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్షకే పెద్దపీట వేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నా రు. తనకు ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా ఉన్నత పదవిని వదు లుకున్న త్యాగమూర్తి సోనియా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, మున్సిపల్ వైస్ చైర్మన్ సిరాజుద్దీన్ మన్సూర్, ఎంపిపి మానస, సా రంగాపూర్ జడ్‌పి టిసి భూక్యా సరళ నాయకులు గాజుల రాజేందర్, కోర్టు శ్రీనివాస్, గంగం మహేశ్, బండ శంకర్, నరేశ్‌గౌడ్, చం ద్రం, రమణ, దుర్గయ్య, నేహాల్, రియాజ్, ముజీబ్ తది తరులు పాల్గొన్నారు.

Comments

comments