Search
Thursday 19 July 2018
  • :
  • :
Latest News

భారీగా తగ్గిన సోనీ ఫోన్ల ధరలు..!

Sony,s

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు సంస్థ సోనీ తన ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్‌ఎస్‌, ఎక్స్‌పీరియా ఎల్‌2, ఎక్స్‌పీరియా ఆర్‌1 ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్‌ఎస్‌ ఫోన్‌ను గత ఏప్రిల్‌ నెలలో రూ.49,990 ధరకు రిలీజ్ చేయగా ప్రస్తుతం ఈ ఫోన్‌ ధర తగ్గి రూ.29,990కి వినియోగదారులకు అందుబాటులో ఉంది. అలాగే ఎక్స్‌పీరియా ఎల్‌2 ఫోన్‌ను ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో రూ.19,990కి రిలీజ్ చేయగా ఈ ఫోన్‌ తాజాగా రూ.14,990 ధరకే లభిస్తున్నది. ఎక్స్‌పీరియా ఆర్‌1 ను గతేడాది అక్టోబర్‌లో సోనీ లాంచ్ చేసింది. దీని ధర రూ.12,990గా నిర్ణయించింది. ఈ ఫోన్‌ కాస్త ఇప్పుడు తగ్గి రూ.9,990కే లభించనుంది. ఈ ఫోన్లు అన్ని సోనీ సెంటర్లు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ పాటు ఇతర ఎలక్ట్రానిక్స్‌ స్టోర్స్‌లోనూ తగ్గింపు ధరలకే అందుబాటులో ఉన్నాయి. మార్కెట్‌లో ఉన్న పలు ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలకు సోనీ ఏమాత్రం పోటీనివ్వలేకపోతున్న సంగతి తెలిసిందే. అందుకే సోనీ కంపెనీ ఫోన్లు ఎక్కువగా అమ్ముడుపోవడం లేదు. దీంతో పాత స్టాక్‌ను క్లియర్‌ చేసే ఉద్దేశ్యంతోనే భారీ తగ్గింపు ధరలకు ఈ ఫోన్లను సోనీ సంస్థ విక్రయిస్తోంది.

Comments

comments