Home తాజా వార్తలు త్వరలో కొత్త రేషన్‌కార్డులు : ఈటల

త్వరలో కొత్త రేషన్‌కార్డులు : ఈటల

ETALA

హైదరాబాద్ : ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ లోపు కొత్త రేషన్‌కార్డలు ఇస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. కొత్త రేషన్‌కార్డులు ఇచ్చేందుకు ఇప్పటి వరకు 89,713 దరఖాస్తులను పరిశీలించామని, 77, 100 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని ఆయన చెప్పారు. మరో లక్షా 66 వేల దరఖాస్తులు పరిశీలించి రేషన్ కార్డులు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఆహార భద్రత చట్టాన్ని 2015 నుంచి అమలు చేస్తున్నామని ఈటల తెలిపారు. 82.64 లక్షల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నామన్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈపాస్ అమలు చేస్తున్నామని, అక్రమంగా బియ్యం తరలించే వారిపై కేసులు పెడుతున్నామని, ఇప్పటి వరకు 175 క్రిమినల్ కేసులు పెట్టామని, 8మందిపై పిడి యాక్ట్ నమోదు చేశామని ఈటల స్పష్టం చేశారు.

Soon New Ration Cards : Etala