Home మెదక్ ఉద్యమకారుల ఘనతను చాటి చెబుతాం

ఉద్యమకారుల ఘనతను చాటి చెబుతాం

జాతీయ పార్టీల నేతలకు త్వరలో సన్మానం
 ప్రజా తెలంగాణ అధ్యక్షుడు ఇన్నయ్య
ENNAIAHసంగారెడ్డి: తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెలంగాణ రా్రష్ట్ర వ్యాప్తంగా చరిత్రలో నిలిచి పోయేలా తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని దేశ వ్యాప్తంగా చెప్పడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్, ప్రజా తెలంగాణ అధ్యక్షుడు ఇన్నయ్య అన్నారు. సో మవారం సంగారెడ్డిలోని టిఎన్‌జిఓ భవన్‌లో తెలంగాణ ఉద్యమ కారు లకు సన్మానం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేక ర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర అంటే కు టుంబ చరిత్ర కాదని, ౪కోట్ల ప్రజలు, అమరుల చరిత్ర అన్నారు. స్వా తంత్ర సంగ్రామం జరిగిన తర్వాత ఆ స్థాయిలో జరిగింది మలిదశ తెలంగాణ పోరాటమేనన్నారు. భారత దేశ స్వాతంత్రం ఒకరికి తాజ్‌మహల్, గో ల్కొండ చరిత్రలు ఒక వ్యక్తులకు పరిమితమయ్యా యన్నారు. అందుకే తెలంగాణ చరిత్రను దేశ వ్యాప్తంగా తెలిసేలా ఒక ప్రణాళికను రూ పొందించి ఉద్యమకారుల చరిత్రను రికార్డులు చేయడం జరుగుతుంద న్నారు. బచావో తెలంగాణ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు, జర్నలిస్టు, లాయర్ల సంఘాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడమె లక్షంగా ముందుకు వ స్తున్నాయన్నారు. డిసెంబర్ 14 నుంచి 21వరకు తెలంగాణ రాష్ట్ర బిల్లుకు సహకరించిన 33జాతీయ పార్టీల నేతలను కలిసి వారికి ఫిబ్రవరిలో తెలంగాణకు ఆహ్వానించి సన్మానం చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది నేటికి కేసులు ఎదు ర్కొంటున్నారని, కొంత మంది రైల్వే కోర్టుల చుట్టూ తిరగడమే సరి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం తెలంగాణ ఉద్యమ కారులు కొండాపూర్ మండలం మల్లెపల్లికి చెందిన నారాయణరెడ్డితో పాటు పలు ప్రాంతాలకు చెందిన ఉద్యమకారులను సన్మానించారు. జిల్లాల వారిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని 1050 మందిని తాము గుర్తించడం జరిగిందని అందులో 490 మందికి అమరుల కోటా కింద నిధులు మంజూరయ్యాయన్నారు. అ ధికారుల లోపం వల్ల ఉద్యమకారులను గుర్తించడంలో ఆలస్యం జరు గుందని దీని కోసం త్వరలోనే కలెక్టర్లను కలవడం జరుగుతుందన్నారు.