Home తాజా వార్తలు ‘శూర‌రై పోట్రు’ సినిమా టైటిల్ లుక్ విడుద‌ల‌

‘శూర‌రై పోట్రు’ సినిమా టైటిల్ లుక్ విడుద‌ల‌

Soorarai Pottruచెన్నయ్ : తమిళ నూతన ఏడాదిని పురస్కరించుకుని ఆదివారం సూర్య 38వ సినిమా ‘శూర‌రై పోట్రు’ టైటిల్ లుక్ ను  విడుదల చేశారు. ఈ లుక్ లో సూర్య నల్ల చొక్కా, తెల్ల పంచె క‌ట్టి విమానం వైపు తదేకంగా చూస్తూ కనిపించారు. శూర‌రై పోట్రు అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాను గురు ఫేం సుధా కొంగ‌ర తెర‌కెక్కించ‌నున్నారు. సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శూర‌రై పోట్రు అంటే శూరులను కీర్తించాలన్నది తెలుగు అర్థం. ఎయిర్‌ డెక్కెన్‌ వ్యవస్థాపకులు పైలెట్‌ జిఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ‘సర్వం తాళమయం’ ఫేమ్‌ అపర్ణా బాలమురళి హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగు నటుడు మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. జివి ప్రకాశ్‌కుమార్ సంగీత అందిస్తున్నారు.  త‌మిళ స్టార్ హీరో అయిన సూర్య వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆయ‌న న‌టించిన ఎన్‌జికె  సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. క‌ప్పాన్ అనే మ‌ల్టీ స్టార‌ర్ సినిమా కూడా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను సైతం  త్వ‌ర‌లోనే విడుద‌ల చేసేందుకు  నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Soorarai Pottru Movie Title Look Release