Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

రష్యా ఓపెన్‌ లో.. సౌరభ్ వర్మకు గోల్డ్…

Sourabh verma won russia open singles title
వ్లాదివోస్టాక్‌: రష్యా ఓపెన్ బిడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్-100 టోర్నమెంట్‌లో భారత ఆటగాడు, మాజీ ఛాంపియన్ సౌరభ్ వర్మ సంచలనం సృష్టించాడు. ఆదివారం జపాన్ కు చెందిన షట్లర్ కోకి వటనబైతో జరిగిన తుది పోరులో సౌరభ్ అద్భుతంగా రాణించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తొలి సెట్‌లో 18-21తో ఓడిన సౌరభ్ ఆ తర్వాత పుంజుకొని 21-12, 21-17 తేడాతో రెండు సెట్లు కైవసం చేసుకొని విజయం సాదించాడు. మరో పక్క మిక్స్‌డ్ డబుల్స్‌ ఫైనల్స్‌లో రోహన్ కపూర్-కుహూ గార్డ్‌ల జోడీ ఓటమిచవిచూసింది. వ్లాదిమిన్ ఇవనోవ్(రష్యా), మిన్ యుంగ్ కిమ్(కొరియా) జోడీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 19-21, 17-21 తేడాతో చిత్తుగా ఓడిపోయింది.

Comments

comments