Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

సఫారీలకు భారీ జరిమానా..!

South-Africa-Team

జొహాన్నెస్‌బర్గ్: వేదికగా వాండరర్స్ మైదానంలో శనివారం జరిగిన నాల్గో వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుకు ఐసిసి జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా సఫారీ జట్టులోని ప్రతి ఆటగాడికి మ్యాచ్ ఫీజులో 10 శాతం, సారథి మార్‌క్రమ్‌కు 20 శాతం జరిమానా పడింది. నిర్ణీత సమయానికి మించి ఒక ఓవర్ ఆలస్యంగా వేసినందుకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాప్ట్ సౌతాఫ్రికా జట్టుకు ఫైన్ వేసిన్నట్లు మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రకటించారు. కాగా, నాల్గో వన్డేలో వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, ఇప్పటికే మొదటి మూడు మ్యాచ్‌లు గెలిచిన కోహ్లీసేన 3-1 తేడాతో ఆరు వన్డేల సిరీస్‌లో ముందజలో ఉన్న విషయం తెలిసిందే.

South Africa have been Fined for a Slow Over Rate in 4th ODI.

Comments

comments