Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

పట్టుబిగించిన దక్షిణాఫ్రికా

 south

ఆసీస్‌తో చివరి టెస్టు
జోహెన్నస్‌బర్గ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన సౌతాఫ్రికా ప్రత్యర్థికి ఫాలోఆన్ ఇవ్వకుండా మళ్లీ బ్యాటింగ్ చేపట్టింది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్ ఎల్గర్ 39 పరుగులతో, కెప్టెన్ డుప్లెసిస్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరో ఓపెనర్ ఐడెన్ మార్‌క్రామ్ 37 పరుగులు చేసి వెనుదిరిగాడు. స్టార్ ఆటగాడు డివిలియమ్స్ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మరో సీనియర్ బ్యాట్స్‌మన్ ఆమ్లా 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కాగా, దక్షిణాఫ్రికాకు ఇప్పటి వరకు 401 పరుగుల ఆధిక్యం లభించింది. చివరి రెండు రోజుల ఆట మిగిలి ఉండడంతో మ్యాచ్‌లో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తోంది. పిచ్ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే సోమవారం నాలుగో రోజే ఆట ముగియడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే భారీ ఆధిక్యాన్ని అందుకున్న సౌతాఫ్రికా ప్రత్యర్థికి బ్యాటింగ్ చేసే అవకాశం తొందరలోనే కల్పించడం ఖాయం. ఇదే జరిగితే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కు కఠిన పరీక్ష తప్పక పోవచ్చు. అంతకుముందు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 221 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ టీమ్ పైన్, కమిన్స్‌లు అసాధారణ పోరాట పటిమతో జట్టును ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కమిన్స్ ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన పైన్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు.

Comments

comments