Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

సెంచూరియన్ టెస్టులో భారత్‌ పరాజయం

Lungi-Ngidi

సెంచూరియన్: వేదికగా భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో టెస్టులో కోహ్లీ సేన ఓటమి పాలైంది. 287 పరుగుల లక్ష్యచేధనతో బరిలోకి దిగిన టీమిండియా 151 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆతిథ్య సఫారీ జట్టు 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. భారత రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ చేసిన 47 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్. చివరలో పేసర్ మహ్మద్ షమీ 28 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. టాపార్డర్ తోపాటు మిడిలార్డర్ కూడా విఫలమవ్వడంతో విరాట్ సేన ఏ దశలోనూ విజయంవైపు పయనించలేదు. సఫారీ బౌలర్లలో ఎంగిడి 6, రబడ 3 వికెట్లు పడగొట్టారు. ఏడు వికెట్లతో దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన ఎంగిడి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 335, రెండో ఇన్నింగ్స్: 258

టీమిండియా తొలి ఇన్నింగ్స్: 307, రెండో ఇన్నింగ్స్: 151

South Africa Won by 135 Runs in Centurion Test.

Comments

comments