Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

సౌతాఫ్రికా ఘన విజయం

  • ఆమ్లా సెంచరీ, రాణించిన డుప్లెసిస్,
  • చెలరేగిన తాహిర్, సఫారీల చేతిలో లంక చిత్తు

SA-Won

లండన్: ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. శనివారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 96 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఓపెనర్ హాషిం ఆమ్లా (103) సెంచరీతో కదం తొక్కడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 299 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 41.3 ఓవర్ల లో కేవలం 203 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇమ్రాన్ తాహిర్ అద్భుత బౌలింగ్‌తో లంక ఇన్నింగ్స్‌ను కుప్పకూ ల్చాడు.
శుభారంభం లభించినా…
భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఓపెన ర్లు డిక్‌వెల్లా, ఉపుల్ తరంగ శుభారంభం అందిం చారు. ఇద్దరు సౌతాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదు ర్కొంటూ ముందుకు సాగారు. ధాటిగా ఆడిన వికెట్ కీపర్ డిక్‌వెల్లా 33 బంతుల్లోనే ఐదు ఫోర్లు, సిక్సర్‌తో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించా డు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్ ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాట పట్టారు. కుశాల్ మెండి స్ 11 పరుగుల మాత్రమే చేసి వెనుదిరిగాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ ఆటగా డు చండీమల్ కూడా నిరాశ పరిచాడు. 12 పరుగులు చేసిన చండీమల్ లేని పరుగు కోసం వెళ్లి రనౌటయ్యాడు. తర్వాత వచ్చిన కపుగెడర (౦) ఖాతా తెరవకుండానే పెవిలి యన్ చేరాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ తరంగ పోరాటం కొనసాగించాడు. అయితే ఆరు ఫోర్లతో 57 పరుగులు చేసిన తరంగను తాహిర్ వెనక్కి పంపాడు. ఇమ్రాన్ తాహిర్ అద్భుత బౌలిం గ్‌తో వెంటవెంటనే వికెట్లు పడగొట్టడంతో లంక మళ్లీ కోలుకోలేక పోయింది. ఒంటరి పోరాటం చేసిన పెరీరా ఐదు ఫోర్లతో 44 పరుగులు చేసి అజేయం గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో తాహిర్‌కు నాలుగు, మోరిస్‌కు రెండు వికెట్లు లభించాయి.
ఆమ్లా జోరు…:అంతకుముందు తొలుత బ్యాటిం గ్ చేసిన సౌతాఫ్రికాను ఓపెనర్ ఆమ్లా ఆదుకు న్నాడు. లంక బౌలర్లను హడలెత్తించిన ఆమ్లా పరుగుల వరద పారించాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే వీలు దొరికితే బౌండరీలు కొడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. మరో వైపు డుప్లెసిస్ కూడా అద్భుతంగా ఆడాడు. ఇద్ద రు చెలరేగి ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తిం ది. కీలక ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్ ఆరు 75 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆమ్లాతో కలిసి డుప్లెసిస్ రెండో వికెట్‌కు 145 పరుగులు జోడించాడు. మరోవైపు కెప్టెన్ డివిలియర్స్(4) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అయితే ఆమ్లా మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు. అద్భు త బ్యాటింగ్ కనబరిచిన ఆమ్లా 115 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 103 పరుగులు సా ధించాడు. డుమినీ 20 బంతుల్లోనే ఐదు ఫోర్లు, సిక్సర్‌తో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచా డు. దీంతో సౌతాఫ్రికా స్కోరు 299కి చేరింది.

Comments

comments