Home తాజా వార్తలు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన దక్షిణాఫ్రికా

భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన దక్షిణాఫ్రికా

ckr
కేప్‌టౌన్: న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న మూడో టి20లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ డిమిని టాస్ గెలిచి ముందుగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా, భారత్ జట్టు పలు మార్పులతో బరిలోకి దిగుతుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో దినేశ్ కార్తిక్, చాహాల్ స్థానంలో అక్షర్ పటేల్‌లు జట్టులో చోటు దక్కించుకోగా, ఉనద్కత్ స్థానంలో బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నాడు.అటు దక్షిణాఫ్రికా జట్టులో కూడా రెండు మార్పులు జరిగాయి. క్రిస్టియన్ జాంకర్, ఆరోన్ ఫాన్‌గిసోలు జట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ డుమిని తెలిపాడు.