Home జాతీయ వార్తలు దక్షిణ మధ్య రైల్వేకు ఆరు జాతీయ అవార్డులు

దక్షిణ మధ్య రైల్వేకు ఆరు జాతీయ అవార్డులు

South-Central-Railwayహైదరాబాద్: అత్యుత్తమ పనితీరుతో ప్రతి ఏటా పలు జాతీయ ఆవార్డులను సొంతం చేసుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాది కూడా తన ప్రతిభ చాటింది. 2015-16 సంవత్సరానికి సంబంధించి పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఏకంగా ఆరు ఆవార్డులను కైవసం చేసుకుంది.
రైల్వే వారోత్సవాల ముగింపు సందర్భంగా భువనేశ్వర్‌లో జరిగిన కార్యక్రమంలో రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు చేతుల మీదుగా ద.మ రైల్వే జిఎం రవీంద్ర గుప్తా అవార్డులను అందుకున్నారు. భద్రత, కమర్షియల్, సివిల్ ఇంజినీరింగ్, హైల్త్‌కేర్, స్టోర్స్, పర్యావరణ పరిరక్షణ విధానాలు విభాగాల్లో ద.మ రైల్వే జాతీయస్థాయి అవార్డులను గెలుచుకుంది. వీటితో పాటు అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు వ్యక్తిగత విభాగాల్లో పలువురు అధికారులు ఔట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డులను సాధించారు.