Search
Wednesday 26 September 2018
  • :
  • :

సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్: ‘బాహుబ‌లి’దే హవా

South Jio Filmfare Awards 2018 winners List

హైదరాబాద్: 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్  కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు, త‌మిళ‌, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు పాల్గొని సందడి చేశారు. తెలుగులో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘బాహుబ‌లి-2’ అవార్డుల పంట పడించింది. ఈ మూవీకి ఏకంగా ఎనిమిది అవార్డులు దక్కడం విశేషం. ఇక ఉత్త‌మ నటుడిగా ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రానికిగాను విజ‌య్ దేవ‌ర‌కొండ, ఉత్తమ నటిగా ‘ఫిదా’ చిత్రానికిగాను సాయి పల్లవి ఎంపికయ్యారు. అలాగే  కైకాల సత్యనారాయణకి జీవితకాల సాఫల్య పురస్కారం దక్కింది.

తెలుగు(టాలీవుడ్)లో విజేతల జాబితా:-

  • ఉత్తమ చిత్రం – బాహుబలి 2
  •  ఉత్తమ దర్శకుడు – రాజమౌళి (బాహుబలి 2)
  • ఉత్తమ నటుడు – విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి)
  • ఉత్తమ నటి – సాయి పల్లవి (ఫిదా)
  • ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) – వెంకటేష్ (గురు సినిమా)
  • ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) – రితికా సింగ్ (గురు)
  • ఉత్తమ సహాయ నటి – రమ్యకృష్ణ (బాహుబలి 2)
  • ఉత్తమ సహాయ నటుడు – రానా దగ్గుబాటి (బాహుబలి 2)
  • ఉత్తమ నటి (తొలి పరిచయం) – కల్యాణ్ ప్రియదర్శన్ (హలో)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – సెంథిల్ కుమార్ (బాహుబలి 2)
  • ఉత్తమ కొరియోగ్రాఫర్ – శేఖర్ మాస్టర్ (ఖైదీ, ఫిదా) – అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు, వచ్చిండే
  • ఉత్తమ గేయ రచయిత – ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2 – దండాలయ్యా సాంగ్)
  • జీవితకాల సాఫల్య పురస్కారం – కైకాల సత్యనారాయణ
  • ఉత్తమ నేపథ్య గాయకుడు – హేమ చంద్ర (ఫిదా – ఊసుపోదు సాంగ్)
  • ఉత్తమ నేపథ్య గాయని – మధు ప్రియ (ఫిదా – వచ్చిండే సాంగ్)
  • ఉత్తమ సంగీత దర్శకుడు – ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2)
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – సాబు సిరిల్ (బాహుబలి 2)
  • తమిళం (కోలీవుడ్‌)

    • ఉత్తమ చిత్రం – అరమ్
    • ఉత్తమ దర్శకుడు – పుష్కర్ గాయత్రి (విక్రమ్ వేద)
    • ఉత్తమ నటుడు – విజయ్ సేతుపతి (విక్రమ్ వేద)
    • ఉత్తమ నటి – నయనతార (అరమ్)
    • ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) – మాధవన్ (విక్రమ్ వేద), కార్తీ (థీరమ్ అడిగరం ఒంద్రు)
    • ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) – అదితి బాలన్ (ఆరువి)
    • ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) – వైరముత్తు (కాట్రు వెలియిదయ్ – వాన్ మూవీ)
    • ఉత్తమ సహాయ నటి – నిత్యా మీనన్
    • ఉత్తమ సహాయ నటుడు – ప్రసన్న
    • ఉత్తమ నేపథ్య గాయకుడు – అనిరుధ్ రవిచందర్
    • ఉత్తమ నేపథ్య గాయని – శశా తిరుపతి
    • ఉత్తమ సంగీత దర్శకుడు – ఏఆర్ రెహ్మాన్ (మెర్సల్)
    • ఉత్తమ తొలి నటుడు – వసంత్ రవి (తారామణి)
  • కన్నడలో ఉత్తమ చిత్రంగా ఒందు మొట్టెయ కథె, ఉత్తమ దర్శకుడిగా తరుణ్ సుధీర్ (చౌక), ఉత్తమ నటుడిగా రాజ్ కుమార, ఉత్తమ నటిగా శ్రుతి హరిహరన్, ఉత్తమ గేయ రచయితగా వి నాగేంద్ర ప్రసాద్ (అప్పా ఐ లవ్యూ – చౌక), ఉత్తమ సహాయ నటిగా భవానీ ప్రకాశ్, ఉత్తమ సహాయ నటుడిగా పి రవిశంకర్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా అర్మాన్ మాలిక్, ఉత్తమ నేపథ్య గాయనిగా అనురాధ భట్, ఉత్తమ సంగీత దర్శకుడిగా బీజే భరత్ అవార్డులు అందుకున్నారు.
  • మలయాళంలో ఉత్తమ చిత్రంగా తొండిముథలుమ్ దృక్సాక్షియుమ్ ఎంపికకాగా, ఉత్తమ దర్శకుడిగా దిలీష్ పోతెన్ , ఉత్తమ నటుడిగా ఫహద్ ఫజిల్, ఉత్తమ నటిగా పార్వతి (టేక్ ఆఫ్) ఉత్తమ సహాయ నటిగా శాంతి కృష్ణ, ఉత్తమ సహాయ నటుడిగా అలెన్సియెర్, ఉత్తమ గేయ రచయితగా అన్వర్ అలీ (మిజియి నిన్ను మిజియిలెక్కు), ఉత్తమ నేపథ్య గాయకుడిగా షాబాజ్ అమన్, ఉత్తమ నేపథ్య గాయనిగా కేఎస్ చిత్ర, ఉత్తమ సంగీత దర్శకుడిగా రెక్స్ విజయన్ (మాయనది), ఉత్తమ తొలిచిత్ర నటుడిగా ఆంటోనీ వర్గీస్ (అంగామలి డైరీస్), ఉత్తమ తొలిచిత్ర నటిగా ఐశ్వర్య లక్ష్మి అవార్డులు అందుకున్నారు.

Comments

comments