Search
Friday 16 November 2018
  • :
  • :

ఉత్తర కొరియా తాజా క్షిపణి పరీక్ష విఫలం

Musdusan-Missileసియోల్‌: ఉత్తర కొరియా తాజాగా చేపట్టిన క్షిపణి పరీక్ష విఫలమైనట్లు దక్షిణ కొరియా, అమెరికా వెల్లడించాయి. ప్యోంగాన్‌ ప్రావిన్సులోని ఓ విమానాశ్రయ సమీపం నుంచి మధ్యస్థాయి క్షిపణి ‘ముసుడాన్‌’ను ఉత్తర కొరియా శుక్రవారం ప్రయోగించినట్లు తెలిపాయి. అయితే, పైకి ఎగిరిన వెంటనే ‘ముసుడాన్‌’ పేలిపోయినట్లు తమకు సమాచారం అందిందని వివరించాయి. పరీక్ష విఫలమైనప్పటికీ, ఐరాస భద్రతామండలి తీర్మానాలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా చేపట్టిన ఈ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించాయి.

Comments

comments