Search
Wednesday 14 November 2018
  • :
  • :

మెట్రో రైలులో ప్రయాణించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు

South Korean President Traveled in Delhi Metro Train

ఢిల్లీ : దక్షిణ కొరియా అధ్యక్షుడు మోన్ జె ఇన్ సోమవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. నోయిడాలోని శ్యాంసంగ్ ప్లాంట్‌ను ఆవిష్కరించేందుకు వారు మెట్రో రైలులో ప్రయాణించారు. అంతకుముందు దక్షిణ కొరియా అధ్యక్షుడు గాంధీ స్మృతిలో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. అక్కడ జరిగిన కచేరీని ఆయన ఆలకించారు. క్లాసికల్ సింగర్ విద్యా షా, గాంధీ భజనలను ఆలపించారు. భారత్ వంద స్మార్ట్ సిటీలను నిర్మించాలని భావిస్తుందని, ఈ స్మార్ట్ సిటీల నిర్మాణానికి భారత్‌తో కలిసి తాము పని చేస్తామని మోన్ జె ఇన్ తెలిపారు. భారత్‌ను మిత్రదేశంగా గుర్తిస్తామన్నారు. తమ దేశం సదరన్ పాలసీని చేపట్టిందని, ఈ క్రమంలో భారత్‌తో మరింత బలమైన బందాన్ని ఏర్పర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

South Korean President Traveled in Delhi Metro Train

Comments

comments