Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

గిరిజన గ్రామాల్లో ఎస్‌పి పర్యటన

village

* ప్రజలు మావోలకు సహకరించవద్దు * పేదవారికి దుప్పట్లు, బియ్యం పంపిణీ

మన తెలంగాణ/పెంచికల్‌పేట్ : మావోయిస్టు ప్రభావిత గిరిజన గ్రామాల్లో జిల్లా ఎస్‌పి సన్‌ప్రీత్‌సింగ్ గురువారం విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా మండలంలోని అగర్‌గూడ గ్రామంలో మావోయిస్టు నేత చౌదరి అంకుబాయి కుటుంబానికి నిత్యావసర సరుకులు, దుప్పట్లను పంపిణీ చేశారు. గత 38 సంవత్సరాలుగా మావోయిస్టుల్లో కీలక నేతగా వ్యవహరిస్తున్న అంకుబాయి జనజీవన స్రవంతిలోకి వచ్చేలా కుటుంబీకులు చూడాలని తెలిపారు. ఆమెకు అన్ని విధాల ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామని  కుటుంబీకులకు వివరించారు. అనంతరం గ్రామంలోని పేద వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. అక్కడి నుండి మురళిగూడ గిరిజన గ్రామానికి వెళ్లి గ్రామ మహిళలతో ముచ్చటించారు. వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జనమైత్రి, ఫ్రెండ్లీ పోలీస్ తదితర వాటి ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం మురళిగూడ సమీపంలో గల ప్రాణహిత అటవీ ప్రాంత అందాలను తిలకించారు. గిరిజన గ్రామాల్లోని యువకులు ఉన్నతమైన చదువులు చదువుకుని పై స్థాయికి రావాలని, పోలీసులు స్నేహపూర్వకంగా తమతో మెలుగుతారని, ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా పోలీసులను ఆశ్రయించి పరిష్కరించుకోవాలని అన్నారు. మండలంలోని అటవీ ప్రాంత పరిసరాలలో పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి మండలంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. మావోయిస్టు వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిఘా వ్యవస్థను పటిష్టంగా నిర్వర్తిస్తూ అటవీ ప్రాంతాలపై డేగకన్నుతో వ్యవహరించాలని ఎస్‌ఐ ప్రభాకర్, బెజ్జూర్ ఎస్‌ఐ రాజుకి సూచించారు. ఈ  పర్యటనలో ఎస్‌పి వెంట కాగజ్‌నగర్ డిఎస్‌పి సాంబయ్య, పోలీసు సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Comments

comments