Search
Saturday 17 November 2018
  • :
  • :

పల్లే నిద్రలో… స్పీకర్ సిరికొండ

Speaker Madhusudanachari took over Palle sleep

మనతెలంగాణ/చిట్యాల ః భూపాల పల్లి నియోజక వర్గంలోని ప్రజలకు సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నని స్పీకర్ సిరికోండ మధుసూదనాచారి అన్నారు. శుక్రవారం మండలంలోని చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో ప్రగతి పల్లే నిద్ర స్పీకర్ మధుసూదనాచారి చేపట్టారు. గ్రామంలోని చేరుకున్న స్పీకర్‌కు పూలమాలలతో ,డప్పు చప్పుళ్ళతో స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ పల్లేల అభివృద్దికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని అన్నారు. చింతకుంట రామయ్యపల్లేలో అనేకంగా అభివృద్ది చేయడం జరిగిందని అన్నారు. గతంలో ఏవ్వరు చేయని అభివృద్ది ఈప్రాంతంలో చేసానని అన్నారు. పల్లేలలోవున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈపల్లేనిద్ర కార్యక్రమం చేపట్టడం జరిందని అన్నారు. జనహితమే తన అభిమతంగా ఉంటు సబ్బండ వర్గాల అభ్యున్నతికై అహర్నిశలు శ్రమిస్తూ నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేస్తున్నాని అన్నారు. చింతకుంట రామయ్యపల్లి గ్రామాన్ని నూతన గ్రామ పంచాయితీగా చేయడం జరిందని అన్నారు. ఒక్క చింతకుంటరామయ్యపల్లి గ్రామంలోనే 45 లక్షల సిసి రోడ్లు,2లక్షల నిదులతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, 25 లక్షల నిధులతో మిషన్ కాకతియ చేరువుపనులు చేయడం జరిగిందని అన్నారు.అనంతరం మడికోండ శ్రీనివాస్ రావు ఇంట్లో పల్లేనిద్ర చేశారు. ఈ కార్యక్రమంలో హాజింగ్ ఫేడరేషన్ చైర్మన్ నవనీతరావు, పరకాల మార్కెట్ కమిటి చైర్మన్ కుంభం రవీందర్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి మల్లయ్య, నాయకులు ఎరుకోండ గణపతి ,దొడ్డి శంకర్,జన్నే యుగేందర్,మడికోండ రవీందర్ రావు,మడికొండ శ్రీనివాస్ రావు. పడిదల బుచ్చరావు,దేవేందర్ ,సర్పంచ్ శ్రీనివాస్‌రావు.కిరణ్,రవీందర్ ,పిట్టల సుదాకర్,రమణాచారి కోడెల రాయమల్లు, గుర్రం తిరుపతి,దనవేని రాయకోంరు.పోతుగంటి రాయలింగు,తదితరులు పాల్గోన్నారు.

Comments

comments