Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం

fourth-year

మనతెలంగాణ/శాయంపేట : తెలంగాణను నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దకోడెపాక గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పదవీ కాలం నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి పావురాలను ఎగురవేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ 70సంవత్సరాల్లో జరుగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని పేర్కొన్నారు. రైతుబంధు పథకంతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. దత్తత తీసుకున్న పెద్దకోడెపాక గ్రామానకి రూ.20కోట్ల అభివృద్ధి పనులు చేశానన్నారు. మండలంలో ఇప్పటి వరకు పెద్దకోడెపాక, కొప్పుల, ప్రగతి సింగారం, నూర్జహన్ పల్లి, గంగిరేణి గూడెం, నర్సింహులపల్లె, సూరంపేట గ్రామాల్లో పల్లెనిద్ర చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నాని తెలిపారు.
రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎడిలు జగదీష్‌బాబు, కుమారస్వామి, ఎఇ రాజమౌళి, రాష్ట్ర హౌజింగ్ ఫెడరేషన్ చైర్మన్ కడారి నవనీతరావు, జడ్పిటిసి వంగాల రమాదేవి, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుర్రం రవీందర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కర్రు ఆదిరెడ్డి, మాజీ ఎంపిపి బాసని చంద్రప్రకాశ్, సర్పంచ్ ఇమ్మిడిశెట్టి రవీందర్, బుట్టి రమేష్, బగ్గి రమేష్, నాయకులు పాడి ప్రతాప్ రెడ్డి, వినుకొండ శంకరాచారి, బుర్రి విజయ్‌కుమార్, గుర్రం అశోక్, కోగిల సదానందం, తుడుం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments