Home జయశంకర్ భూపాలపల్లి ఎస్‌ఆర్‌ఎస్‌పి పనులను వేగవంతం చేయాలి: స్పీకర్

ఎస్‌ఆర్‌ఎస్‌పి పనులను వేగవంతం చేయాలి: స్పీకర్

Speaker madusudanachary Checke SRSP Canal Works

మనతెలంగాణ/ రేగొండ ః రేగొండ మండలం నుండి చిట్యాల మండలం చివరి అయకట్టు వరకు ఉన్న ఎస్‌ఆర్‌ఎస్‌పి మరమత్తు కాల్వల పనులను స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మంగళవారం ద్విచక్ర వాహనంపై పరిశీలించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి ఎకరానికి త్రాగు నీరు,సాగు నీరు అందించడం కోసం కాళేశ్వరం ,దేవాదుల ప్రాజేక్టుల ద్వారా నీరు సరఫరా చేయడం జరుగుతుందని స్పీకర్ తెలిపారు. దినితో పాటు ప్రతి గ్రామంలోని చేరువులను నింపడం వలన పంటలు పండించుకోవచ్చని అన్నారు. రెగోండ మండలం నుండి చిట్యాల మండలంలోని చివరి అయకట్టు వరకు ప్రతి ఎకరానికి నీరు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక నిధులను ఖర్చు చేస్తుందని అన్నారు. రైతులు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిబియం 38 కాల్వల ద్వారా నీటిని తిసుకవచ్చేందుకు ఎంతో కృషి చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని అన్నారు. రైతుల కోసం కెసిఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. కాల్వ మరమత్తు పనులను తోందరగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను అదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి అధికారులు,పరకాల మార్కెట్ చైర్మన్ కుంభం రవీందర్ రెడ్డి,టిఆర్‌ఎస్ నాయకులు  ,మటిక సంతోష్,ఐలి శ్రీధర్,మైస బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.