Home రాష్ట్ర వార్తలు ప్రజా సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ

ప్రజా సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ

  • ఓపెన్ కాస్టులు, ధర్నాచౌక్‌పై త్వరలో అఖిలపక్ష సమావేశాలు : కోదండరామ్

Kodandaram

హైదరాబాద్ : ప్రజా సమస్య ల పరిష్కారానికి ప్రత్యేక కార్యచరణతో ముందు కు సాగుతామని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫె సర్ ఎం.కోదండరామ్ అన్నారు. బొగ్గు గనుల లో ఓపెన్ కాస్ట్ (ఉపరితల తవ్వకాలు)లకు వ్యతిరేకంగా, ధర్నాచౌక్ పరిరక్షణకు త్వరలోనే వేర్వేరుగా అఖిలపక్ష సమావేశాలను నిర్వహిం చనున్నట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ రంగాల పై జెఎసి రాష్ట్రస్థాయి ప్రతినిధులకు ఈనెల 23 న హైదరాబాద్‌లో అవగాహన తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ జెఎసి స్టీ రింగ్ కమిటీ సమావేశం ఆదివారం జెఎసి కా ర్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. అనంతరం కోదండరామ్ మీడియాకు వివరాలను వెల్లడిం చారు. మంథనికి చెందిన మధూకర్ హత్య ఘట న విషయంలో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు. దళితులైన కొంపల్లి దంప తుల విషయంలో కూడా పోలీసులు అమాను షంగా వ్యవహరించారని, అప్పుడే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే, మధుకర్ ఘటనలో పోలీసుల తీరు మారేదని అన్నారు. రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి పంటకు రూ.12 వేల కనీస మద్దతు ధర ఇవ్వాలని, కందు లను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సింగ రేణిలో వారసత్వ ఉద్యోగాల అంశంపై ఈ నెల 10న మంచిర్యాలలోని శ్రీరాంపూర్‌లో సదస్సును నిర్వహిస్తున్నామని, నిజాం షుగర్ కంపెనీ పరిరక్షణకు ఈ నెల 17న బోధన్ నుంచి నిజామాబాద్ వరకు జెఎసి ఆధ్వ ర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నామని వివరించారు. హరితహారం పేరుతో ఆదివాసులు తమ భూములను కోల్పోతున్నారని, ఈ ప్రాంతాలను త్వరలోనే తాను పర్యటించి, వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేసి, మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్నారు. ప్రొఫెసర్ల వయోపరిమితిని మరో రెండేళ్లు పొడిగించాలని సూచించారు. ఈనెలలో నిరుద్యోగ సమస్యలపై విద్యార్థి జెఎసి చేపట్టినున్న సభకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వారికి బాధ్యతలు ఉండవు
వివిధ రాజకీయ పార్టీల్లో క్రీయశీలకంగా ఉన్న వారికి జెఎసిలో బాధ్యతలను ఇవ్వబోమని కోదండరామ్ స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి తెలంగాణ జెఎసి నిర్మాణాన్ని మరింత పటిష్టం చేస్తున్నామన్నారు. ఈ నెల 22 నాటికి మండల కమిటీలను, మే నాటికి గ్రామ స్థాయి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. విద్యుత్, సాగునీరు, వ్యవసాయం, వృత్తులు, విద్య, వైద్యం, ఉపాధి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, వర్తమాన పరిసిస్థితులపై జిల్లా, మండల స్థాయిలో జెఎసి శ్రేణులకు అవగాహన తరగతులను నిర్వహి స్తామని తెలిపారు. స్టీరింగ్ కమిటీలో వ్యవసాయం, కార్పొరేట్ విద్యా ఫీజుల నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో రైతు జెఎసిని మరింత విస్తృతం చేయాలని, అందుకు తగిన సహ కారాన్ని అందించాలని టిజెఎసి తీర్మానించింది.వృత్తులపై అధ్యయనం చేసేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో జెఎసి కో-ఛైర్మన్లు ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, ఖాజా మొయినుద్దీన్, కన్వీనర్ కె.రఘు, ప్రతినిధులు సంధ్య, జి.వెంకట్‌రెడ్డి, గురిజాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.