Search
Wednesday 17 October 2018
  • :
  • :

దసరా పండుగకు ఆర్టిసి ప్రత్యేక ఏర్పాట్లు…

rtc

హైదరారబాద్: దసరా పండగను పురస్కరించుకుని ఆర్టిసి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఎంజిబిఎస్‌లో శుక్రవారం రంగారెడ్డి రీజినల్ మేనేజర్ ట్రాఫిక్ అధికారులుతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్ళే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సంబంధిత సమస్యలను ఎప్పటికప్పుడే పరిష్కరించేందుకు ట్రాఫిక్ అధికారులు సహాయసహకారాలు తీసుకుంటున్నామని, అంతే కాకుండా ప్రయాణికుల భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి 18 వరకు బస్సుల సెక్టారు వారీగా ఏర్పాట్లు చేశామని వాటి ద్వారా ప్రయాణికులు తమకు సమీపం ప్రాంతాల్లోంచే బస్సుల్లో ప్రయాణించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మిర్యాలగూడ, నల్గొండ వెళ్ళే ప్రయాణికులకు దిల్‌షుక్‌నగర్ టర్మినల్ వద్ద , అదే విధంగా వరంగల్, యాదగిరి గుట్ట వెళ్ళే వారి కోసం ఉప్పల్ ఎక్స్‌రోడ్స్, ఉప్పల్ టర్మినల్ వద్ద, సీమాంద్ర ప్రయాణికులకు కోసం ముఖ్యంగా నంద్యాల, ఆత్మకూరు(కె), కోయలకుంట్ల, ఆళ్ళగడ్డ, మైదుకూరు, బనగానపల్లి, జమ్మలమడుగు, కడప, చిత్తూరు, పులివెందుల, పొద్దుటూరు ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికుల కోసం కాచిగూడ టర్మినల్ వద్ద, కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ప్రాంతాలకు వెళ్ళే వారి కోసం జూబ్లీహిల్స్ బస్టేషన్ వద్ద నుంచి బస్సులు బయలు దేరుతాయన్నారు.అంతే కాకండా బస్‌టెర్మినల్స్‌కు చేరుకునేందుకు ప్రతి 15 నిమిషాలకు అందుబాటులో ఉండే విధంగా ఎంజిబిఎస్‌లో ప్రత్యేకంగా ఫ్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎంజిబిఎస్ నుంచి ఉప్పల్ వెళ్ళే ప్రయాణికుల కోసం 18, 19 ఫ్లాట్‌ఫామ్, దిల్‌షుక్‌నగర్ వెళ్ళేవారి కోసం ఫ్లాట్ ఫామ్ 14,15, కాచిగూడ వెళ్ళే వారి కోసం ఫ్లాట్ ఫామ్ 45, ఎంజిబిఎస్ నుంచి జూబ్లీహిల్స్ బస్టాండ్‌కు వెళ్ళే ప్రయాణికుల కోసం 53 నుంచి 53 ప్లాట్ ఫామ్‌ల వరకు కేటాయించిన్ల చెప్పారు. ప్రయాణికుల కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Special arrangements to the Dussehra festival

Comments

comments