Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

అంగన్‌వాడీలు ఆదర్శవంతంగా పనిచేయాలి

Special attention should be given to pregnant and infants

గర్భిణులు, పసిపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
నూతన అంగన్‌వాడీ టీచర్ల నియామకంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి

మన తెలంగాణ/సిద్దిపేట కలెక్టరేట్: నిబద్దతతో పనిచేసి సిద్దిపేట జిల్లాకు మంచి పేరు తీసుకరావాలని నూతనంగా నియాకమైన అంగన్‌వాడీ టీచర్లకు జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి సూచించారు. బుధవారం జాయింట్ కలెక్టర్ పద్మాకర్‌తో కలిసి జిల్లా వ్యాప్తంగా నియమితులైన అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ సహాయకుల కు నియామక పత్రాలను సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో అందజేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు స్త్రీ, శిశువులకు చేరే విధంగా అంగన్‌వాడీలు కృషి చేయాలన్నారు. అంగన్‌వాడీలు, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ ,చేర్యాల ప్రాజెక్టులు ఉన్నాయని ఇందుకు గాను మార్చి 2018 నెలలో వేసిన అంగన్‌వాడీటీచర్లు, మీని అంగన్‌వాడీ టీచర్లు, సహాయకురాళ్లను ప్రతికా ప్రకటన ద్వారా జిల్లా వ్యాప్తంగా పోస్టులు భర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఓ బూరవిజయ, డిఆర్‌వో చంద్రశేఖర్, హుస్నాబాద్ ఆర్డీవో,జిల్లా సంక్షేమ అధికారి జరినాభేగం, సంబంధిత సీడీపీవోలు పాల్గొన్నారు.

Comments

comments