Home రాష్ట్ర వార్తలు పేదలపై ప్రత్యేక దృష్టి

పేదలపై ప్రత్యేక దృష్టి

పేద కుటుంబాల బాగుకు కార్యక్రమాలు చేపట్టాలి : కలెక్టర్లకు సిఎం సూచన 

CMహైదరాబాద్ : “మీ జిల్లా కొరకు మీరు ప్రణాళిక తయారు చేయండి. వివిధ రుణాలకు సంబం ధించి పదేళ్ల ప్రణాళిక రూపొందించాలి. ఇప్పుడు మీ జిల్లా ఎలా ఉంది? పదేళ్ల తర్వాత ఎలా ఉండాలో ప్రణా ళిక రూపొందించండి. దాని ప్రకారం మనం పని చేద్దాం అని” సిఎం కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. ప్రొవైడింగ్ లీడర్‌షిప్, కౌన్సెలింగ్ ద పీపుల్, మ్యాప్ ద లోకల్ రిసో ర్స్, ట్యాప్ ద వెల్త్ అనే ప్రాతిపదికపై పని చేయాలి. ప్రజ లను భాగస్వాములు చేస్తూ కార్యక్రమాలను విజయ వంతం చేయాలి. కలెక్టర్లుగా మీకు వచ్చిన అవకాశం, ప్రజల ఓట్ల ద్వారా మాకిచ్చిన అధికారం అంతిమంగా ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలి. మనం కూడా వెయ్యే ళ్లు బతకం. కాబట్టి వచ్చిన అవకాశాలు కలకాలం నిలిచే విధంగా ఉపయోగపడే పనులు చేయాలి అని కెసిఆర్ ఉద్బోధించారు. ప్రగతి భవన్‌లో ఆదివారం 31 జిల్లాల కలెక్టర్లతో సమావేశం జరిగింది. సమావేశంలో పలు అంశాలపై సిఎం కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. పరి పాలనా సౌలభ్యం, ప్రజలకు  సౌకర్యం, పాలనా వికేంద్రీకరణ లక్షాలుగా ఏర్పడిన కొత్త జిల్లాల ద్వారా ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు కావాలని ఆయన అన్నారు. ప్రతి కుటుంబం జీవన స్థితిగతులను అధ్యయనం చేసి, పేదరికం లో ఉన్న కుటుంబాలను గుర్తించాలని, వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని సిఎం కోరారు. జిల్లాల వారీగా ఎస్‌సి,ఎస్‌టి సబ్ ప్లాన్ సిద్ధం చేయాలి. బడ్జెట్ ప్రవేశపెట్టేలోగా జిల్లాల నుంచి ప్రతిపాదనలు రావాలి. దళి తులకు ఏమి కావాలనే విషయంలో మీరే ప్రణాళిక రూపొందించండని ఆయ న అన్నారు. “కొత్త జిల్లాలు బాగా స్థిరపడాలి, కలెక్టర్లు బాగా పనిచేస్తున్నారు. హాస్పిటల్స్, హాస్టల్స్ సందర్శిస్తున్నారు, సమస్యల పరిష్కారానికి ఉత్సాహాంగా కృషి చేస్తున్నారు. నాకు మీ పనితీరు సంతోషానిస్తుంది. ఇదే ఉత్సాహంతో పనిచేస్తే మనం అనుకున్న లక్షాలను చాలా తొందరగా అందుకుంటామనే నమ్మకం నాకున్నది. మీరు జిల్లాకు నాయకత్వం వహిస్తున్నారు. అధికార యంత్రాంగానికి అవసరమైన నాయకత్వ ప్రేరణ మీరు. మీ సారథ్యంలో అధికారులు బాగా పనిచేసేలా చూసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో అద్భుత మానవశక్తి ఉంది. జనగామ-పెంబర్తిలో నగిషీ కళాకారులు, కరీంనగర్ ఫిలిగ్రీ ఆర్ట్ ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన వారు. ఇలా ప్రతి ప్రాంతంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన మానవ వనరులున్నాయి. వాటిని ప్రోత్సహించాలి. చేయూ తనివ్వాలి. తెలంగాణ రాష్ట్రం 19.5 శాతం వృద్ధి రేటుతో దేశంలో మొదటి స్థానం పొందింది. భవిష్యత్తులో కూడా మన రాష్ట్రం ఇదేరకమైన వృద్ధి రేటు కొనసాగిస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులను అవ గతం చేసుకుని పేదరిక నిర్మూలనకు కృషి చేయాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరి పుష్టానికి మనం ప్రత్యేక దృష్టి పెట్టాలి. రీసోర్స్ మ్యాపింగ్‌లో మానవ వన రులను గుర్తించాలి” అని అన్నారు.
యాదవులున్నా, గొర్రెలను దిగుమతి చేసుకుంటున్నాం : “రాష్ట్రంలో 25 లక్షల మంది యాదవులున్నా, ప్రతి రోజు 500 లారీల గొర్రెలు రాష్ట్రానికి దిగుమతి కావడం బాధా కరమన్నారు. గొర్రెల పెంపకంలో అనుభవం, నైపుణ్యం ఉంది. వారికి వృత్తి నైపుణ్య శిక్షణ అవసరం లేదు. అందుకే గొర్రెల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేప ట్టాలని నిర్ణయించాం. మన రాష్ట్రమే గొర్రెలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థితికి రావాలి. కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో గొర్రెల పెంపకం కోసం ప్రత్యేక కార్యక్రమం అమలు చేయాలి. చేపల పెంపకం పెద్ద ఎత్తున జరగాలి. చెరువులు, రిజర్వాయర్లు, బ్యారేజీలలో చేపల పెంపకానికి అనువైన కార్యాచరణ రూపోందించాలి. అనేక ఆధునిక పద్దతులొచ్చాయి. వాటిని అందిపుచ్చుకోవాలి” అని సిఎం అన్నారు.
నవ్వులు పూయించిన సిఎం : “గొర్రెలన్నీ ఒకే తీరుగ కన్పిస్తాయి. కాని ప్రతి గొర్రెను ప్రత్యేకంగా గుర్తించే నైపుణ్యం యాదవులకు ఉంటుంది. ఏదైనా గొర్రె అనారోగ్యంతో బాధపడితే కూడా గుర్తించి వైద్యం చేయిస్తడు. గ్రామాల్లో ఇతరులు కూడా గొర్రె పిల్లలను మేపడానికి యాదవులకు ఇస్తారు. పెద్దయిన గొర్రెలు ఎవరిదో గుర్తించి వారికి అందచేస్తారు యాదవులు. అనుభవమే వారికి చదువు. అలాంటి నైపుణ్యం ఐఎఎస్ చదవిన వారికి కూడా ఉండదు” అని కెసిఆర్ చెప్పడంతో సభలు నవ్వులు పూశాయి. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రె పిల్లలను కొనుగోలు చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో గొర్రె పిల్లలను కొనవద్దు అని ఆయన సూచించారు.
చెట్ల కింద, బండల కింద కటింగ్ చేసే పరిస్థితి పోవాలి : “గ్రామాల్లో చెట్ల కింద, బండల మీద కూర్చోబెట్టి కటింగ్, గడ్డాలు చేసే పరిస్థితి పోవాలి. అధునాతన సెలూన్లు రావాలి. ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తుంది. మంచి సెలూన్లతో గ్రామాల్లో కూడా రూపురేఖలు మారతాయి. అధునాతన లాండ్రీల ఏర్పాటు, ఇతర కులవృత్తులకు సంబంధించి కార్యక్రమాల రూపకల్పన జరు గుతుంది. బిసిల అభివృద్ధి, కులవృత్తులకు ప్రోత్సాహం విషయంలో ప్రభు త్వం చిత్తశుద్ధితో ఉంది. వీరి కోసం చేపట్టే కార్యక్రమాలను పర్యవే క్షించడా నికి సిఎంఒ లోనే ప్రత్యేక అధికారులను నియమిస్తాం” అని సిఎం చెప్పారు.
మానవ వనరులను వినియోగించుకోని దేశం మనదే : “తెలంగాణ జనాభా లో 16-17 శాతం ఎస్‌సిలు, 10శాతం ఎస్‌టిలు, 50 శాతం మహి ళలు ఉన్నారు. ఎస్‌సిలను ఊరికి దూరంగా ఉంచారు. ఎస్‌టిలను తండాలు, గూడాలకు పరిమితం చేశారు. మహిళలను వంటింటికి పరిమితం చేశారు. 75 శాతం మందిని ఉపయోగించుకోవట్లేదు. ఇంత పెద్ద మొత్తంలో మానవ వనరులను ఉపయోగించుకోని దేశం ప్రపంచంలో భారతదేశం మాత్రమే ఉంది.ఈ రుగ్మతను పోగొట్టాలి. ఎస్‌సి, ఎస్‌టిలతో పాటు మహిళలను ప్రోత్స హించాలి. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ గురుకులాల కోసం స్థలాలు గుర్తిం చాలి” అని కెసిఆర్ సూచించారు.
సిఎం చెప్పిన మరిన్ని విషయాలు : ప్రతి కలెక్టర్ వద్ద రూ.5 కోట్ల చొప్పున పెడతాం. తక్షణ పరిష్కారం చూపేందుకు ఈ డబ్బులు వినియోగించాలి. అనాథ పిల్లలకు మంచి విద్య, వసతి ప్రభుత్వమే కల్పించాలి. వారి కోసం ప్రత్యేక స్కూళ్లు ఏర్పాటు చేయాలి. మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమం మరోసారి నిర్వహించాలి. గ్రామాల్లో ఎవరెవరి పరిస్థితి ఎలా ఉంది? వారికి ఏ అవసరం ఉంది? అనే విషయాలపై వివరాలు సేకరించాలి. పశుసంవర్థక శాఖను బలోపేతం చేయాలి. గ్రామాలకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా దళిత, గిరిజన ప్రాంతాలను సందర్శించి స్థితిగతులు, సమస్యలు స్వయంగా తెలుసు కోవాలి. సాదాబైనామాల ద్వారా పట్టాలిచ్చే కార్యక్రమం త్వరగా ముగిం చాలి. కారుణ్య నియమాకాలు చేపట్టాలి. భార్యభర్తలు ఒకే చోట పని చేసేలా బదిలీలు చేయాలి. స్కూళ్ల యూనిఫారాలు స్థానిక దర్జీలే కుట్టేలా చూడాలి. జనగామలో ఆత్మరక్షణ కోసం మహి ళలకు సామూహిక శిక్షణ ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం అవసరమైన స్థలం గుర్తించాలి. గ్రామాల్లో క్లీన్ ద విలేజ్ అనే కార్య క్రమం చేపట్టాలి. క్లీన్ ద విలేజ్ కింద ఎంపికైన గ్రామాలకు కలెక్టర్ రివార్డు పేరిట నగదు బహుమతి అందించాలి. దళిత కాలనీలు, గిరిజన తండాలకూ అవార్డు ఇవ్వాలి. చెత్త,భవన శిథిలాలు తొలగించడంలో అందరినీ భాగ స్వామ్యం చేయాలి. పాడుబడ్డ బావులను, బోరు గుంతలను పూడ్చివేయాలి. గ్రామాల్లో పవర్ డే నిర్వహించాలి. వంగిన స్థంభాలు, వేలాడే తీగలను సరి చేయాలి. ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర శుభ్రం చేయాలి. గ్రామాల్లో నిర్మించే స్మశాన వాటికలకు వైకుంఠ ధామం అనే పేరు పెట్టాలి. కుటుంబంలో ఒకరికి ఆసరా పెన్షన్ వచ్చినప్పటికీ మరొకరికి బీడీ కార్మికులకు భృతి ఇవ్వాలి. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించేలా నిబంధనలు మరింత సరళం చేశాను, వేగం పెంచాలి. బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు ఇండ్లు కట్టించే పథకం కింద కేంద్రం నుంచి నిధులు తేవడానికి ప్రతిపాదనలు పంపాలి. రోడ్డు మీద ఎట్టి పరిస్థితుల్లో గుంతలు ఉండకుండా చర్యలు తీసుకోవాలి. గుంతలు పూడ్చ కుంటే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ శాఖల్లో మిగు లు ఉద్యోగులను గుర్తించి పనిభారం ఉన్న చోట నియమించాలి. ఇక్కడ మనం అనుకున్న పనులన్నీ విజయవంతం చేసేలా కలెక్టర్లు కృషి చేయాలి” అని సిఎం అన్నారు.